Agricultural: ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వరుసగా నాలుగోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వచ్చే నెల 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా, ఈ సారి రాబోయే బడ్జెట్ ఎలా ఉండబోతున్నదనే చర్చ జరుగుతున్నది. వివిధ వర్గాల ప్రజలకు కేంద్రం ఏ మేరకు ఊరట కలిగించనుంది,? కేటాయింపులు ఎలా ఉంటాయి? అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొవిడ్ మహమ్మారి వలన ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పైన ఆసక్తి పెరుగుతున్నది.
ముఖ్యంగా ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఇచ్చే ప్రయారిటీ గురించి చర్చ జరుగుతన్నది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇకపోతే ఈ సారి కేటాయింపుల్లో వ్యవసాయ రంగ వర్గాలకు చాలా ఆశాలే ఉన్నాయి. ప్రీ బడ్జెట్ మీటింగ్స్‌లో భాగంగా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, రైతు సంఘాలతో సమావేశం అయ్యారు.
Also Read: Social Updates: సినీతారల సంక్రాంతి అప్డేట్స్ మీకోసం..!
కనీస మద్దతు ధర నిర్ణయించడానికి స్వయం ప్రతిపత్తి కలిపించాలని సూచించారు. ఉత్పాదకతను పెంచడానికిగాను సాంకేతికత వినియోగంపైన దృష్టి పెట్టాలని తెలిపారు. ఇక్రిసాట్, ఐసీఏఆర్ వంటి సంస్థలు అభివృద్ధి చేసిన జన్యు సాంకేతికతకు ఆమోదం తెలపాలని కోరారు. నరేగాను వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానం చేయాలని కోరారు.
Also Read:2022లో రాబోయే మూవీ సిక్వెల్స్ ఇవే..!