Social Updates: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినీ తారలు సోషల్ మీడియాలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. తమ అభిమానులకు సంక్రాంతి విషెస్ చెబుతూనే.. చక్కటి ఫొటోలు, వీడియోల రూపంలో అప్ డేట్స్ అందించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు.

సంక్రాంతి రోజున మెగాస్టార్ చిరంజీవి చిన్న పిల్లాడిలా మారిపోయాయి. కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేశారు. వరుణ్ తేజ్ తో కలిసి మెగాస్టార్ వేడి వేడి దోశలు వేస్తూ సందడి చేయడంలో నెట్టింట్లో వైరల్ గా మారింది.
యాంకర్ హరితేజ తన పాపకు బోగిపళ్లు పోసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్, సింగర్ శ్రీరామ్, సుశాంత్, నవదీప్, అనసూయ గాలిపాటలు ఎగరేస్తూ కన్పించారు. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, శద్ధాదాస్ కలర్ ఫుల్ దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్టు చేశారు.
[…] YS Jaganmohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యతతోనే ఉన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీపై కాలు దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా పలు పార్టీల నేతలను కలుస్తున్నారు. కాగా, జగన్ మాత్రం బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. కాగా, ఆ విషయం జగన్‌కు కలిసొస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. […]