ప్రజలకు మేలు చేస్తూ.. ప్రజల మనస్సులు గెలుచుకున్న లీడర్ పది కాలాల పాటు పాలించాలని ఎవరైనా కోరుకుంటారు. కొంత మంది లీడర్లు సైతం తమ సీటు తమను వదిలి వెళ్లకూడదని ప్రయత్నిస్తుంటారు. ఇందుకు ప్రజలకు అవసరమైన పథకాలు అమలు చేస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్నది అదే. 30 ఏళ్లు అధికారంలో ఉండాలని జగన్ టార్గెట్. అందుకే సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారు. అయితే.. అన్నీ సక్రమంగా ఉంటే అవి పాలిటిక్స్ ఎందుకవుతాయి..? దారిలో నడుస్తుంటే ఎవరో ఒకరు మోకాలడ్డడం కామన్ కదా.
Also Read: చంద్రబాబును ఛీ అన్న ఎన్టీఆర్.. వైరల్ సాక్ష్యం
30 ఏళ్లు సీఎంగా ఉండాలని జగన్ అనుకుంటున్నా.. కానీ.. ఆ మూడు ప్రాంతాల్లోని ఆరుగురు నేతలు మాత్రం జగన్‌కు ఆ అవకాశం ఇచ్చేలా కనిపిచడం లేదు. ఒక్కసారికే జగన్ ను ఇంటికి పంపించేయాలని అనుకుంటున్నారట. ఇందుకు కారణాలూ లేకపోలేదు. అనేక జిల్లాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కొందరు నేతల కారణంగా వచ్చేటికి డబుల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదట. జగన్‌ను ముంచుతున్నదీ, ముంచేది ఆ నేతలేనన్న చర్చ పార్టీలోనే జరుగుతోంది.
జగన్ పలు ప్రాంతాలను ఆయా నేతలకు సొంతం చేసినట్లుగా అర్థమవుతోంది. అందుకే.. అక్కడ వారు చెప్పిందే వేదంలా నడుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలయినా వారికి అవసరం లేదు. పార్టీ బలోపేతం సంగతి పక్కన పెట్టి సొంత ప్రయోజనాలే చూసుకుంటుండటంతో వైసీపీలో విభేదాలు రచ్చ కెక్కుతున్నాయి. దీంతో వారి పేరు బయటకు చెప్పకపోయినా అధికారులపై వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అధికారులు వారిమాట వినకపోవడానికి జగన్ నియమించిన ఈ ధర్మకర్తలే కారణమని అందరికీ తెలిసిందే.
Also Read: జగన్ కు ఇది ఊహించని పరిణామం
చిత్తూరు జిల్లాను తీసుకుంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే వేదం. ఆయన మాట శాసనం. ఈ విషయం వైసీపీ ఎమ్మెల్యే రోజా బహిరంగంగా చెప్పకపోయినా అధికారులు తనను పట్టించుకోవడం లేదని విలపించడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా లేకుండానే సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఎవరి ప్రోద్బలమనేది చెప్పనవసరం లేదు. ఇక నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ పెత్తనం చెలాయిస్తున్నారు. అక్కడ ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా నెల్లూరు ఎస్పీపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, రాయలసీమలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. వీరి ప్రవర్తనతో వైసీపీ ఎమ్మెల్యేలకే విలువ లేకుండా పోతోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చెప్పినట్లే అంతా జరుగుతోంది. ఇలా కొద్ది మంది చేతుల్లోనే అధికార యంత్రాంగం ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే తాము తిరిగి ఎలా గెలుస్తామని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: They are want to send jagans home
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com