Worst Food In India: భారత్ లో అత్యంత చెత్త ఆహారం ఇదే..జాబితా విడుదల చేసిన ‘టేస్ట్ అట్లాస్’.. హైదరాబాద్ బిర్యానీ ఎన్నో స్థానమో తెలుసా?

టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసిన జాబితాలో భారతీయ వంటకాల్లో చాలా వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని భారతీయులు ఇష్టంగా తినే ఫుడ్ కూడా ఉండడం విశేషం. టేస్ట్ అట్లాస్ తెలిపిన కొన్ని వంటకాలను యాక్సెప్ట్ చేస్తున్నా.. మరికొన్ని వాటిని చెత్త ఆహారం అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సాంప్రదాయ, హెల్తీ ఆహారం అయిన వాటిని కూడా చెత్త ఆహరం అనడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళన చేపడుతామని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంతకీ భారతీయ వంటకాల్లో చెత్త ఆహారం ఏదంటే?

Written By: Chai Muchhata, Updated On : July 16, 2024 10:00 am

Worst Food In India

Follow us on

Worst Food In India: మనిషి బతకాలంటే ఏదో ఒకటి తినాలి. అలాగని ఏది పడితే అది తీసుకోవడం వల్ల శరీరం సహకరించదు. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల నాణ్యమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉన్నారు. అయితే పూర్వ కాలం నుంచే కొందరు పెద్దలు కొన్ని ఆహార పద్దతులు పాటించారు. కొన్ని ఆహార పదార్థాలను తయారు చేసిన వాటిని తరువాత తరాల వారికి పరిచయం చేశారు. భారత దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లభించే ఆహార పదార్థాలను బట్టి వారు తీసుకుంటూ ఉంటున్నారు. మరి వీటిలో మంచిది ఏదీ? చెత్త ఆహారం ఏదీ? అనేది ఎలా తెలియాలి? ఈ తరుణంలో అంతర్జాతీయ సంస్థ అయిన ‘టేస్ట్ అట్లాస్’ భారత్ లో ఉండే మంచి, చెత్త ఆహార జాబితాలను విడుదల చేసింది. వీటిలో ఏమేం ఉన్నాయంటే?

టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసిన జాబితాలో భారతీయ వంటకాల్లో చాలా వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని భారతీయులు ఇష్టంగా తినే ఫుడ్ కూడా ఉండడం విశేషం. టేస్ట్ అట్లాస్ తెలిపిన కొన్ని వంటకాలను యాక్సెప్ట్ చేస్తున్నా.. మరికొన్ని వాటిని చెత్త ఆహారం అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సాంప్రదాయ, హెల్తీ ఆహారం అయిన వాటిని కూడా చెత్త ఆహరం అనడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళన చేపడుతామని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంతకీ భారతీయ వంటకాల్లో చెత్త ఆహారం ఏదంటే?

టేస్ట్ అట్లాస్ సంస్థ తెలిపిన ప్రకారం భారతీయ వంటకాల్లో అత్యంత చెత్త ఆహారంలో మొదటి స్థానంలో ‘జల్దీరా’ను చేర్చింది. కానీ ఇది వేసవి కాలంలో ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలుపుతున్నారు. ఆ తరువాత గజ్జక్, తెంగైసదం, పంతాబాద్, ఆలూ వంకాయ్ కర్రీ, తండాయ్, అచ్చప్పం, మిర్చికా సలాన్, మల్ఫువా, ఉప్మాలు ఉన్నాయి. వీటిలో దక్షిణ భారతదేశంలో ఉప్మాను అధికంగా తీసుకుంటూ ఉంటారు. దీనిని పదో స్థానంలో చేర్చారు. ఇక హైదరాబాద్ లో మిర్చికా సలాన్ కు ప్రసిద్ధి చెందింది. తెలుగు రాష్ట్రాల్లో ఆలూ, వంకాయ్ కర్రీను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

బెంగాల్ కు చెందిన ‘పాంటా భాట్’ ను చెత్త ఆహారం అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది వేసవి కాలంలో ఎంతో బలమైన ఆహారంగా వర్ణిస్తారు. పాంటా భాట్ అంటే పులియబెట్టిన ఆహారం. అంటే వండిన అన్నం నీళ్లో నానబెట్టి దీనికి చెట్నీ జోడించి తింటారు. ఇలా తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సాంప్రదాయ వంటకం మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే దీనిని చెత్త వంటకం అనడంపై జీర్ణియంచుకోలేకపోతున్నారు. దీనిని మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పడూ కొన్ని చోట్ల తింటూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎక్స్ వేదికగా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

టేస్ట్ అట్లాస్ చెత్త ఆహారం మాత్రమే కాకుండా బెస్ట్ ఫుడ్స్ జాబితాను ప్రకటించింది. వీటిలో మొదటి స్థానంలో ‘మామిడి లస్సీ’ నిలిచింది. ఆ తరువాత మసాల చాయ్, బటర్ గార్లిక్, అమృత్ సర్ కుల్చా, బటర్ చికెన్, హైదరాబాద్ బిర్యానీ, షాహి పనీర్, చోలే భటురే, తందూరీ చికెన్, కోర్మా లు వరుసగా ఉన్నాయి. దేశంలో టెస్టీ ఫుడ్ గతంలో నెంబర్ వన్ స్థానంలో నిలవగా ఈసారి ఆరో స్థానానికి పడిపోయింది. అయితే బెస్ట్ ఫుడ్ లో ఎక్కువగా డ్రింక్ ఫుడ్ ఉండడం విశేషం. మొదటి స్థానంలో నిలిచిన చోలే భటురే నార్త్ లో ఎక్కువగా ఫేమస్. తందూరీ చికెన్, బటర్ చికెన్ వంటివి సౌత్ లోనూ ఇష్టపడి తింటూ ఉంటారు.