Chaddannam: ‘చద్దన్నం’ చెత్త ఆహారమట..! ‘టేస్ట్ అట్లాస్’ పై ఇండియన్ల ఆగ్రహం.. చద్దన్నం ఎంత బలవర్ధకమో తెలుసా?

మన తెలుగవారైతే ఒకప్పుడు చద్దన్నం ను పౌష్టికాహారంగా.. సామాన్యులకు పరమ ఔషధంగా పేర్కొంటారు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే ఇడ్లీ, పూరీ లేదా బ్రెడ్ వంటి స్నాక్స్ తీసుకుంటున్నారు. ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు, నీరసం ఉంటున్నాయి. దీంతో రోజంతా హుషారుగా పనిచేయలేకపోతున్నారు. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కాల క్రమంలో అనేక ఆనారోగ్యాల బారిన పడుతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : July 16, 2024 10:00 am

Chaddannam

Follow us on

Chaddannam: మనిషి ఆరోగ్యానికి సరైన ఆహారం అవసరం. పూర్వ కాలంలో పెద్దలు చాలా రోజులు యాక్టివ్ గా ఉండేవాళ్లు. అందుకు కారణం వారు తీసుకున్న నాణ్యమైన ఆహారం. పూర్వకాలంలో తీసుకున్న ఆ ఆహారం ఎంతో నాణ్యతతో ఉండడం వల్ల వీటిని ఇప్పటికీ కొందరు ఫాలో అవుతున్నారు. వీటిలో చద్దన్నం ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో చద్దనం అని అంటున్నా.. ఇది దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహారం. దీనిని బెంగాల్ లో పాల్ భాట్, ఒడిశాలో ఫకాలా, అస్సాంలో పోయిటా భాట్, తమిళనాడులో కంజీ గా పిలుస్తారు. బెంగాల్ లో ప్రారంభమైన ఈ ఆహారం ఆ తరువాత దేశవ్యాప్తంగా తయారు చేసుకున్నారు. అయితే ఇంతటి బెస్ట్ ఫుడ్ ను ‘టేస్ట్ అట్లాస్’లో చెత్త ఫుడ్ గా చేర్చడం భారతీయులు మండిపడుతున్నారు. అసలు చద్దన్నం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

మన తెలుగవారైతే ఒకప్పుడు చద్దన్నం ను పౌష్టికాహారంగా.. సామాన్యులకు పరమ ఔషధంగా పేర్కొంటారు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే ఇడ్లీ, పూరీ లేదా బ్రెడ్ వంటి స్నాక్స్ తీసుకుంటున్నారు. ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు, నీరసం ఉంటున్నాయి. దీంతో రోజంతా హుషారుగా పనిచేయలేకపోతున్నారు. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కాల క్రమంలో అనేక ఆనారోగ్యాల బారిన పడుతున్నారు. కానీ ఒకప్పుడు ఉదయం లేవగానే చద్దన్నం తిని పనుల్లోకి వెళ్లేవారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకైనా ఎలాంటి నీరసం లేకుండా పనులు చేసేవారు. చద్దన్నం లేనిదే రోజుగడవదు అని అనుకునేవారు. అంతలా చద్దన్నంలో ఏముంటుందంటే?

చద్దన్నంలో అనేక పోషకాలు ఉంటాయని పెద్దలు మాత్రమే కాకుండా వైద్యులు సైతం నిర్దారించారు. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. విటమిన్లు దాదాపు 15 రెట్లు అధికంగా ఉంటాయి. పోటాషియం, కాల్షియం కావాలనుకునే వారు చద్దన్నం తినాలని అంటుంటారు. చద్దన్నం తినాలనుకునే వారు ఒకరోజు ముందు రాత్రి దీనిని తయారు చేసుకోవాలి. రాత్రి వండిన అన్నంలో పెరుగు కలిపి పెడుతారు. దీనిని ఉదయం పచ్చి మిర్చి లేదా ఉల్లిగడ్డ నంజుకొని తింటారు. అయితే రాత్రి పూట మిగిలిన అన్నంలో పెరుగు మాత్రమే కాకుండా పాలు పోసి కూడా ఉంచాలి. ఉదయం లేవగానే ఇది పులియబెట్టినట్లు అవుతుంది. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఏదైనా చెట్నీని యాడ్ చేసుకొని కూడా తినొచ్చు.

చద్దన్నం బెంగాల్ లో ‘ పాల్ భాట్ ’ అంటారు. అయితే ఇక్కడ పాల్ భాట్ తయారీ విధానం వేరే ఉంటుంది. వీరు వండిన అన్నాన్ని నీటిలో నానబెడుతారు. కొంత సమయం అలా ఉంచిన తరువాత ఆ ఆహారాన్ని చట్నీతో నంజుకొని తింటారు. తమిళనాడు ప్రాంతంలో ‘కంజి’ అంటారు. మనదగ్గర గంజి గా పిలుస్తారు. వండిన ఆహారం నుంచి వచ్చే గంజిలో ఆహారాన్ని వేసుకొని తింటూ ఉంటారు. ఇది కూడా బలవర్ధకమైన ఆహారమే. చద్దన్నం మాత్రమే కాకుండా గంజిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఇలా వివిధ ప్రాంతాల్లో చద్దన్నంను ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇది బలవర్ధకమైన ఆహారం అని ఇప్పటికే నిర్దారణ అయింది. కానీ టేస్ట్ అట్లాస్ మాత్రం తన 13వ జాబితాల్లో వరస్ట్ ఫుడ్ గా మన చద్దన్నంను చేర్చడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి చద్దన్నం ను చెత్త ఆహారం జాబితాలో చేర్చితే ఆందోళన చేపడుతామని కొందరు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. భారతీయ సాంస్కృతి, చరిత్రలో పోషకాహారంగా ఉన్న ఈ ‘చద్దన్నం’ను చెత్త ఆహారం అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.