తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలివీ

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది రూ.50వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఆగస్టు 15 నుంచి ఈనెలాఖరులోపు రూ.50వేల రుణమాఫీని పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో రూ.50వేల లోపు రుణం తీసుకున్న 6 లక్షల […]

Written By: NARESH, Updated On : August 1, 2021 6:07 pm
Follow us on

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది రూ.50వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఆగస్టు 15 నుంచి ఈనెలాఖరులోపు రూ.50వేల రుణమాఫీని పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

కేబినెట్ నిర్ణయంతో రూ.50వేల లోపు రుణం తీసుకున్న 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు పంట రుణ వివరాలను ఆర్థికశాఖ అధికారులకు కేబినెట్ కు అందజేశారు.

ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తెలంగాణ కేబినెట్ లో చర్చ జరిగింది. రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వానాకాలం పంటల సాగుపై మంత్రివర్గం భేటీలో చర్చ జరిగింది.

వర్షాలు, పంటలు, సాగునీరు, ఎరువుల లభ్యతపై చర్చించారు. తెలంగాణలో పత్తికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పత్తిసాగు పెంచాలని నిర్ణయించింది. పత్తిసాగు పెంపునకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

ఇక తెలంగాణలో వాక్సినేషన్ వేగవంతం చేయాలని.. ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల సమాచారాన్ని సేకరించి వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సూచించింది.