హుజురాబాద్ ఉప ఎన్నికకు వేళైంది.. ఎప్పుడంటే?

హుజురాబాద్ రాజకీయం రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రోజుకో మలుపులు తిరుగుతూ ప్రజల్లో ఆసక్తి కలిగిస్తోంది. రాష్ర్టమంతా హుజురాబాద్ వైపే చూస్తోంది. ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తుందని చూస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఒక వైపు మరో వైపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ప్రచారం చేపడుతున్నారు. వివిధ పథకాల పేరుతో టీఆర్ఎస్ ఓట్లను కొల్లగొట్టాలని భావిస్తుంటే ఉద్యమ నేతగా ఈటల రాజేందర్ తనను ఆశీర్వదించాలని ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో […]

Written By: Srinivas, Updated On : August 1, 2021 6:13 pm
Follow us on

హుజురాబాద్ రాజకీయం రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రోజుకో మలుపులు తిరుగుతూ ప్రజల్లో ఆసక్తి కలిగిస్తోంది. రాష్ర్టమంతా హుజురాబాద్ వైపే చూస్తోంది. ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తుందని చూస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఒక వైపు మరో వైపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ప్రచారం చేపడుతున్నారు. వివిధ పథకాల పేరుతో టీఆర్ఎస్ ఓట్లను కొల్లగొట్టాలని భావిస్తుంటే ఉద్యమ నేతగా ఈటల రాజేందర్ తనను ఆశీర్వదించాలని ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గెలుపోటములపై ప్రజల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం ప్రభుత్వం పచ్చ జెండా ఊపే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఢిల్లీ నుంచి కూడా సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల దేశంలో జరిగే ఎన్నకలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణపై స్టేట్ల అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రం లేఖ రాయడంతో దీనికి అవి సుముఖంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

ఆగస్టు నెలాఖరుకు షెడ్యూల్ విడుదల చేసి సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను షెడ్యూల్ వెలువడిన తరువాత సీఎం కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ర్టంలో ఇప్పుడే ఎన్నికలు వద్దనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని సీఎస్ సోమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి తెలిపినట్లు ప్రచారం సాగుతోంది.

దళిత బంధు పథకంతో రాజకీయాలు తమకు అనుకూలంగా మారతాయని అధికార పార్టీ భావిస్తోంది. తొందరగా ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ ఉబలాటపడుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి హుజురాబాద్ పైనే పడింది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మధ్య సగటు ఓటరుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి.