
రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వనరులు- సవాళ్లు పేరుతో బీజేపీ నేతలు విశాఖలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం తాజాగా రూ. 11 వేల కోట్లు ఇచ్చిందని, మరిన్ని నిధులు ఇవ్వానలి కేంద్రాన్ని కోరతామన్నారు.