కేసీఆర్ ఎప్పుడు? ఈనెల జీతాల పెంపు లేనట్టే

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన జీతాల పెంపు ఈనెల సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈనెల కూడా జీతాల పెంపు లేక ఉద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. 30 శాతం జీతాల పెంపును ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఆనందం ఇప్పుడు వాటిని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల కనుమరుగైనట్లు కనిపిస్తోంది. ఈ మార్చిలో రాష్ట్ర అసెంబ్లీలో కేసిఆర్ జీతాల పెంపును ప్రకటించారు. […]

Written By: NARESH, Updated On : May 18, 2021 5:03 pm
Follow us on

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన జీతాల పెంపు ఈనెల సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈనెల కూడా జీతాల పెంపు లేక ఉద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. 30 శాతం జీతాల పెంపును ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఆనందం ఇప్పుడు వాటిని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల కనుమరుగైనట్లు కనిపిస్తోంది.

ఈ మార్చిలో రాష్ట్ర అసెంబ్లీలో కేసిఆర్ జీతాల పెంపును ప్రకటించారు. మే నెలలో చెల్లించాల్సిన ఏప్రిల్ జీతాల నుంచి ఈ పెంపు ఉద్యోగులకు లభిస్తుందని భావిస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారి రెండో వేవ్ కారణంగా అధికారులు సవరించిన జీతాల పెరుగుదల ప్రణాళిక జాబిత సిద్ధం చేయలేకపోవడంతో ఈనెల పెంపు సాధ్యపడడం లేదు.

జీతాల పెంపుపై సంవరించిన జాబితా అధికారులు తయారు చేసినప్పటికీ, ఏప్రిల్‌లో అనుమతి కోసం ఫైల్‌ను కేసీఆర్ ముందు ఉంచడం సాధ్యం కాలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కోవిడ్ -19తో బాధపడ్డాడు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యాడు. ఈనెల మే మొదటి వారంలో మాత్రమే ప్రగతి భవన్‌కు తిరిగి వచ్చాడు.

అయినప్పటికీ, సవరించిన పే స్కేల్స్ సమస్యపై ముఖ్యమంత్రి ఎటువంటి శ్రద్ధ చూపలేదు, తెలంగాణలో వచ్చిన సెకండ్ వేవ్ తీవ్రతతో కోవిడ్ -19 పరిస్థితిని పరిష్కరించడంలో బిజీగా ఉన్నారు. ఈ పీఆర్సీ జీతాల విషయం గురించి కేసీఆర్‌ను గుర్తుచేసే అధికారులు కూడా సాహసించలేదు. ఫలితంగా, ఇది ఇప్పటికీ ప్రగతి భవన్ లోని కేసీఆర్ టేబుల్ మీద పడి ఉంది.

ప్రతి నెల మూడో వారంలో ఉద్యోగులందరికీ పే బిల్లులు తయారు చేయబడతాయి కాబట్టి, జీసీ పెంపుకు సంబంధించిన ఫైల్‌కు కేసీఆర్ తన అనుమతి ఇవ్వనందున, జూన్ నుండి కూడా సవరించిన పే స్కేల్స్ అమలు చేయబడటం లేదు. కాబట్టి, ఉద్యోగులు వారి పెరిగిన జీతాలు పొందడానికి కనీసం ఒక నెల పాటు వేచి ఉండాలి!