రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు అనేది సామెత. రాజకీయాలను కొత్త ఒరవడితో చూసే వారు కొందరుంటారు. మూస పద్ధతిలో నడిపేవారు ఉంటారు. రాజకీయాలకు భాష్యం చెప్పే వారు ఉంటారు. ఇదే కోవలోకి తమిళనాడు సీఎం స్టాలిన్ వస్తారు. ఆయన నూతన ఒరవడితో పరిపాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షాలను సైతం పరిపాలనలో భాగం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. తనదైన శైలిలో ముందుకు వెళ్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
తెలుగు సీఎంల వైఖరి
స్టాలిన్ ను చూసి తెలుగు సీఎంలు నేర్చుకోవాల్సి ఉంది. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లపై దాడి చేసిన సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేయించి ఆదర్శంగా నిలిచారు. కానీ మన వారు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా తెలంగాణ, ఏపీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీలోనైతే ఎక్కువగా ఉన్నాయి. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తిపోస్తుంటే అధికార పక్షం అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ర్టంలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది.
ప్రతిపక్షాలతో కలిసి..
రాష్ర్ట భవిష్యత్తు కోసం తమిళనాడు సీఎం కొత్త పంథా ఎంచుకున్నారు. అభివృద్ధిలో ప్రతిపక్షాలను సైతం బాధ్యులను చేస్తూ ముందుకు వెళుతున్నారు. దీంతో అందరి సలహాలు, సూచనలు పాటిస్తూ మంచి పనులు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ భాగస్వామ్యం అవుతున్నాయి.
ఆదర్శ నేతగా..
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదర్శ నేతగా ఎదుగుతున్నారు. పరిపాలనలో కొత్త పుంతలు తొక్కుతూ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. విధి విధానాల రూపకల్పన, నిర్ణయాలు, అమలు తదితర విషయాలపై అందరి సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. దీంతో ఆయన విధానాలు మెచ్చి ప్రశంసిస్తున్నారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నస్టాలిన్ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. రాబోయే కాలంలో కూడా మరిన్ని పథకాలు ప్రారంభించి ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.