https://oktelugu.com/

రాజధానే లేదు.. విశాఖలో మెట్రో నిర్మిస్తారట..!

పెండింగ్‌లో ఉన్న ఏప్రాజెక్టునూ పూర్తిచేయలేదు కానీ.. మంత్రుల మాటలు చూస్తుంటే మరో కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. మరో వైపు సమస్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తూనే ఉన్నాయి. రాజధాని కూడా లేని రాష్ట్రానికి ఇప్పుడు మెట్రో తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారని మంత్రుల మాటల్లోని సారాంశం. సరే.. ఇది ఒక విధంగా బెటర్‌‌ ప్రాజెక్టే అయినప్పటికీ నిధులు లేని సమయాన ఈ ప్రాజెక్టును ఎంత టైమ్‌లో కంప్లీట్‌ చేస్తారు.. అసలు కంప్లీట్‌ అవుతుందా..? అనే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2020 / 02:22 PM IST
    Follow us on


    పెండింగ్‌లో ఉన్న ఏప్రాజెక్టునూ పూర్తిచేయలేదు కానీ.. మంత్రుల మాటలు చూస్తుంటే మరో కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. మరో వైపు సమస్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తూనే ఉన్నాయి. రాజధాని కూడా లేని రాష్ట్రానికి ఇప్పుడు మెట్రో తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారని మంత్రుల మాటల్లోని సారాంశం. సరే.. ఇది ఒక విధంగా బెటర్‌‌ ప్రాజెక్టే అయినప్పటికీ నిధులు లేని సమయాన ఈ ప్రాజెక్టును ఎంత టైమ్‌లో కంప్లీట్‌ చేస్తారు.. అసలు కంప్లీట్‌ అవుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

    Also Read: ఏపీలో పోలవరం పాలిటిక్స్‌? తప్పు ఎవరిది?

    ‘ఏపీ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అధికారం చేపట్టి ఏడాదిన్నరనే అయినా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం’ అంటూ మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ.. ఇంతవరకు రాష్ట్రంలో మేజర్‌‌ ప్రాజెక్టులపై ఒకటి అమరావతి కేంద్రంగా రాజధాని, పోలవరం పూర్తిచేయలేదు. అక్కడి సీఎం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల ప్రక్రియ కూడా అమలుకు రాలేదు. కానీ.. ఇప్పుడు విశాఖ మెట్రో కట్టడానికి టెండర్లు పిలవడానికి సిద్ధమయ్యారు. మెట్రో రైల్ కార్యాలయాన్ని హడావుడిగా విజయవాడ నుంచి విశాఖకు తరలించిన మంత్రి బొత్స.. అట్టహాసంగా దసరా రోజు కార్యాలయాన్ని ప్రారంభించేశారు. ఇదిగో ఇక మెట్రో కట్టడమే ఆలస్యం అన్నట్లుగా ప్రకటనలు చేశారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచేస్తున్నామని స్పష్టం చేశారు. మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. మెట్రో హామీ విభజన చట్టంలో ఉందని.. కేంద్రమే నిర్మించాలని ఆయన అంటున్నారు.

    పోలవరం ప్రాజెక్ట్, రాజధాని కూడా విభజన చట్టంలో ఉన్నాయన్న సంగతి బొత్సకు గుర్తుందో లేదో కానీ.. ఆయన కట్టేయడమే మిగిలిందని చెబుతున్నారు. విశాఖ, విజయవాడలకు మెట్రోలను కేంద్రం మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం చాలావరకు పోరాడింది. కానీ.. ఫలితం రాలేదు. చివరికి సొంత నిధులతో అయినా నిర్మించాలనుకుంది. మెట్రో మ్యాన్ శ్రీధరన్‌కు డీపీఆర్ బాధ్యతలు ఇచ్చింది. విశాఖ మెట్రోకు సంబంధించి గత ప్రభుత్వమే డీపీఆర్‌ల పని పూర్తిచేసింది. అయితే కొత్త ప్రభుత్వం ఆ ప్రయత్నాలన్నింటినీ చెత్తబుట్టలో వేసింది. ఫిబ్రవరిలో విశాఖలోని మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్‌‌ల రూపకల్పన కోసం ప్రతిపాదనలను పిలవాల్సిందిగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

    Also Read: జగన్‌ లేఖపై మరో ఆసక్తికర పరిణామం!

    మహానగరమైన హైదరాబాద్‌లోనే మెట్రో ఉంది. అయితే.. ఇక్కడ మెట్రో ప్రారంభమైన రోజే విశాఖలోనూ 79.9 కిలోమీటర్ల మేర మెట్రోరైల్‌ నిర్మాణం చేయాలని కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. విశాఖలో  ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం అన్నీ ఉన్నాయి.. ఒక్క మెట్రో వేస్తే సరిపోతుందని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. దాని ప్రకారం ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చారు. కేంద్రం పెట్టుబడి పెట్టినా హైదరాబాద్ మెట్రో డీపీఆర్ స్టేజ్ నుంచి ప్రారంభం కావడానికి పదేళ్లు పట్టింది. మరి ఈ విధంగా చూస్తే.. విశాఖ మెట్రో సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలనుకుంటే పునాదులు కూడా పడే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి.