ఏపీలో పోలవరం పాలిటిక్స్‌? తప్పు ఎవరిది?

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందా..? ఇప్పటికే ప్రాజెక్టుకు చాలా వరకు డబ్బులు ఇచ్చాం.. ఇక ఇచ్చేది లేదన్నట్లు వ్యవహరిస్తోందా..? ఏపీ ప్రభుత్వం మెతక వైఖరిని ఆసరాగా చేసుకొని కేంద్రం ఆ నిర్ణయం తీసుకుందా..? పోలవరం కాస్త ఇప్పుడు రాజకీయ క్రి‘నీడ’లా మారబోతోందా..? గత ప్రభుత్వ వైఫల్యాలే ఇప్పుడు దుస్తికి కారణం అవుతున్నాయని వైసీపీ చెప్పుకురానుందా..? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. Also Read: పోలవరం: […]

Written By: NARESH, Updated On : October 26, 2020 4:32 pm
Follow us on

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందా..? ఇప్పటికే ప్రాజెక్టుకు చాలా వరకు డబ్బులు ఇచ్చాం.. ఇక ఇచ్చేది లేదన్నట్లు వ్యవహరిస్తోందా..? ఏపీ ప్రభుత్వం మెతక వైఖరిని ఆసరాగా చేసుకొని కేంద్రం ఆ నిర్ణయం తీసుకుందా..? పోలవరం కాస్త ఇప్పుడు రాజకీయ క్రి‘నీడ’లా మారబోతోందా..? గత ప్రభుత్వ వైఫల్యాలే ఇప్పుడు దుస్తికి కారణం అవుతున్నాయని వైసీపీ చెప్పుకురానుందా..? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

Also Read: పోలవరం: పునరావాసాన్ని గాలికొదిలేస్తున్న కేంద్రం, ఏపీ

పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వంలోనే రూ.52 వేల కోట్ల ప్రతిపాదనలకు టెక్నికల్ కమిటీ ఆమోదం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఆ విషయం స్పష్టంగా చెప్పింది. ఇది జగన్‌ ఘనతగానే చెప్పుకుని భారీగా ప్రచారం కూడా చేశారు. మరి ఇప్పుడు రూ.20 వేల కోట్లే ఇస్తామని కేంద్రం చెప్పుకొస్తోంది. ఇలాంటి సందర్భంలో అలా ఎలా తగ్గిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. టీడీపీ చేసిన తప్పు వల్లే అంటూ ఎదురుదాడికి దిగుతోంది. ఇలా టీడీపీపై దుమ్మెత్తిపోస్తే పోలవం ప్రాజెక్టు పూర్తి కాదు అనే విషయం వైసీపీ నేతలకు తెలియదా..! కేవలం టీడీపీ మీద ఎదురుదాడి చేస్తే చాలన్నట్లుగా ఏపీ సర్కార్ తీరు ఎందుకు ఉంది..?

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తర్వాత కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఓ నోట్ విడుదలైంది. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.2,200 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా అందులో పేర్కొంది. కానీ కేంద్రం రూ.20 వేల కోట్ల ప్రతిపాదనకు అంగీకరిస్తేనే ఆ నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం షరతు పెట్టింది. మామూలుగా అయితే.. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమనాలి.

Also Read: రాజధానే లేదు.. విశాఖలో మెట్రో నిర్మిస్తారట..!

కానీ.. అలా చేయకుండా ఓ సమీక్ష పెట్టి సీఎం జగన్ మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులకు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారట. అయితే.. కేంద్రంలోని పెద్దలకు తెలియకుండా ఆర్థిక మంత్రి ఈ నిర్ణయం మాత్రం తీసుకొని ఉండరు. అలాగని.. వారిని నిలదీసే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదు. అందుకే.. ఈ లేఖలతో సరిపెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుకు కదులుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వీటికితోడు..ఇప్పుడు రాష్ట్రంలో ఈ పోలవరం నిధుల విషయంపై మాత్రం రాజకీయాలు ముదిరే కనిపిస్తున్నాయి.