https://oktelugu.com/

‘డార్క్’ వెబ్ సిరీస్ వెనుక మహేష్ హస్తం ఉందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. తన సినిమాకు సంబంధించి ప్రమోషన్లతోపాటు ఫ్యామిలీ.. పర్సనల్ విషయాలను ట్వీటర్.. ఇన్ స్ట్రాలో షేర్ చేస్తుంటాడు. అయితే మహేష్ ఇటీవల ఓ వెబ్ సీరిస్ గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జర్మన్ భాషలో తెరకెక్కిన ‘డార్క్’ వెబ్ సిరీస్ తనకు ఎంతో బాగా నచ్చిందని.. అందరూ వీలుచూసుకొని ఓసారి చూడండి అంటూ అభిమానులను సూచించాడు. Also Read: […]

Written By: NARESH, Updated On : October 26, 2020 4:40 pm
Follow us on

Mahesh Babu in Dark Webseries

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. తన సినిమాకు సంబంధించి ప్రమోషన్లతోపాటు ఫ్యామిలీ.. పర్సనల్ విషయాలను ట్వీటర్.. ఇన్ స్ట్రాలో షేర్ చేస్తుంటాడు. అయితే మహేష్ ఇటీవల ఓ వెబ్ సీరిస్ గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. జర్మన్ భాషలో తెరకెక్కిన ‘డార్క్’ వెబ్ సిరీస్ తనకు ఎంతో బాగా నచ్చిందని.. అందరూ వీలుచూసుకొని ఓసారి చూడండి అంటూ అభిమానులను సూచించాడు.

Also Read: పిల్ల దొరక లేదు గానీ.. పెళ్లికి రెడీ అంటున్న తేజు.. !

‘డార్క్’ వెబ్ సీరీసులో అసలేం ఉంది అనే తెలుసుకునేందుకు ప్రతీఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. తెలుగు సినీ అభిమానులు ‘డార్క్’ వెబ్ సిరీసును ఆసక్తిగా తిలకిస్తున్నారట. దీంతో ఈ ‘డార్క్’ సిరీసుకు తెలుగులో ఆదరణ లభిస్తుందనే టాక్ విన్పిస్తోంది. జర్మనీ భాషకు చెందిన ‘డార్క్’ వెబ్ సీరిస్ ను చూసి అర్థం చేసుకోవాలంటే చాలా ఓపిక అవసరమని.. అన్నింటికి మించి ఏకాగ్రత అవసరమనే టాక్ విన్పిస్తోంది.

ఈ వెబ్ సిరీసులను తిలకించాలంటే ప్రతీ ప్రేక్షకుడు ఓ విద్యార్థిలా పుస్తకం పట్టుకుని ఫ్లో చార్టులు గీసుకుంటూ అర్థం చేసుకోవాలట. జరుగుతున్న ఒక్కో సంఘటనను గుర్తుపెట్టుకుంటూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక కాలం నుంచి మరో కాలానికి ఓ వ్యక్తి వెళ్లిపోతాడు. 1953-1986-2019 మూడుకాలాల్లో జరిగే కథ కావడంతో దీనిని చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.

ఒక కాలంలోని వ్యక్తులు మరొక కాలంలోకి ఎలా ప్రవేశించారనేది చాలా చిత్రవిచిత్రాలతో ములుపుతూ తిరుగుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఎవరూ ఊహించని కథను.. కథనాన్ని అందించి ప్రేక్షకులను డార్క్ వెబ్ సీరిస్ ఉత్కంఠకు గురి చేయనుందట. దీంతో ఈ వెబ్ సీరిసును చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

Also Read: ప్రభాస్ కు ధీటుగా దీపిక పాత్ర ఉండనుందా?

ఇంటర్నెట్ ఫుణ్యామా అని అన్ని భాషల్లోని ఓటీటీలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. సినిమాకుకు మించిన కంటెంట్ తో వెబ్ సీరిసులు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడో జర్మనీలో నిర్మించబడిన ‘డార్క్‌’ వెబ్‌ సీరీస్‌ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రేక్షకులు అలరిస్తోంది. ఈనేపథ్యంలోనే డార్క్ వెబ్ సీరీసు అత్యంత ప్రజాదరణ పొందుతోంది. ఇలాంటి మంచి వెబ్‌ సీరీస్‌లు ఎప్పుడోగానీ రావని వీలైతే ఓసారి లుక్కేయండని సినీ విశ్లేషకులు సైతం ‘డార్క్’ వెబ్ సీరీసుకు కితాబిస్తున్నారు.