రాజకీయాల్లో జగన్ మొండిగా వ్యవహరిస్తారనే పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన తర్వాత ఆయనకు తిరుగేలేకుండా పోయిందన్నది విశ్లేషకుల మాట. ఇక, ఆయన పార్టీలో పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎవ్వరూ వేలెత్తి చూపించలేరు. కానీ.. అందలం ఎక్కాలనే ఆశ అందరికీ ఉంటుంది కదా! రాజకీయాల్లో ముఖ్యమంత్రి పోస్టు తర్వాత అత్యున్నత అందలం మంత్రి పదవే కదా. వైసీపీలో దానికోసం ఎదురు చూస్తున్నవారికి లెక్కేలేదు. అలాంటి వారంతా.. జగన్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు చేపడతాడా? ఎప్పుడు మినిస్టర్ గిరీ దక్కుతుందా? అని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు.
మొదటి సారి పాతిక మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు జగన్. కానీ.. ఆశావహులను చూస్తే.. వంద మందికిపైగానే ఉన్నారు. మరి, వీరందరినీ సైలెంట్ గా ఉంచాలంటే.. ఓ మంత్రం వేయాలి. జగన్ వేసిన ఆ మంత్రమే సగం పాలన. అంటే.. ఇప్పుడున్న మంత్రివర్గం సరిగ్గా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వారికి అవకాశం ఇస్తా అని చెప్పారు. దీంతో.. ఆశావహులు సరేలే అని సరిపెట్టుకున్నారు.
సీన్ కట్ చేస్తే.. జగన్ పాలన చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక, ఆర్నెళ్లు ఆగితే తమ టైమ్ వస్తుందని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇలాంటి సమయంలో వారి ఆశలపై నీళ్లు చల్లే ప్రచారం ఒకటి తెరపైకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణ వంటిది ఏమీ లేదన్నది దాని సారాంశం. ప్రస్తుతం మంత్రిపదవి ఆశిస్తున్న వారు వంద మందికి పైగా ఉండడంతో.. వారందరికీ పదవి ఇవ్వలేరు. ఒకరికి ఇచ్చి, మరొకరిని కాదంటే ఇంకో తంటా. ఇవన్నీ ఎందుకు అనుకొని పాత మంత్రి వర్గాన్నే కొనసాగించాలని చూస్తున్నారట.
అయితే.. ఇదంతా వ్యూహమేనని చెబుతున్నారు. మొదట్లో మంత్రివర్గ విస్తరణ చేస్తామని చెప్పడమూ.. ఒకవేళ ఇప్పుడు చేపట్టకపోయినా ఇవి రెండూ వ్యూహాలుగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. మొదట్లో ఆశించిన వారిని చల్లబరచాలంటే.. మీక్కూడా అవకాశం ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు విస్తరణ చేపడితే.. అందరికీ పదవి ఇవ్వలేరు కాబట్టి మిగిలినవారు నిరాశకు లోనవుతారు.
పైగా.. ఇప్పుడున్నవారిని తొలగిస్తే.. వీరి నుంచీ వ్యతిరేకత వస్తుంది. వీళ్లిద్దరూ కలిస్తే.. అదో పెద్ద తలనొప్పి. కాబట్టి.. ఇవన్నీ ఎందుకులే అని మంత్రివర్గ విస్తరణ చేయకపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ ను ప్రశ్నించేవారు కూడా లేరు. అందువల్ల.. జగన్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని అంటున్నారు. మరి, చివరకు జగన్ మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఆసక్తికరం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: There is no cabinet expansion shock to ycp leaders
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com