
ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ఆలయాన్ని ఇవాళ తెరిచారు. సాంప్రదాయ రీతిలో ఆలయ పూజారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ ఉదయం 7.30 నిమిషాలకు ఆలయ ద్వారాలను ఓపెన్ చేశారు. కేవలం పూజారులు, కొద్ది మంది భక్తులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఛార్ థామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని నిన్ననే తెరిచిన విషయం తెలిసిందే. ఇక సోమవారం రోజులన కేదార్ నాథ్, మంగళవారం రోజున బద్రీనాథ్ ఆలయాలను తెరవనున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చార్ థామ్ యాత్రను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.