అప్పుడే ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ

‘నువ్వు ఒక్క హామీ ఇస్తే.. నేను ఇంకో నాలుగు ఇస్త..’.. ఇదీ నిత్యం రాజకీయాల్లో వింటుంటాం. ముఖ్యంగా ఎన్నికలు వచ్చాయంటే హామీల మీద హామీలు గుప్పిస్తుంటారు. అయితే.. తామేం తక్కువా అన్నట్లు బీజేపీ కూడా నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లు హామీలిస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కూడా కాలేదు. వచ్చే ఎన్నికల కోసం టికెట్ కౌంటర్‌‌ను బీజేపీ ఓపెన్ చేసిందని ప్రచారం జరుగుతోంది. హాట్ ఫేవరేట్ సీట్లను ముందుంచి మరీ బడా నేతలకు గాలం […]

Written By: Srinivas, Updated On : December 18, 2020 9:53 am
Follow us on


‘నువ్వు ఒక్క హామీ ఇస్తే.. నేను ఇంకో నాలుగు ఇస్త..’.. ఇదీ నిత్యం రాజకీయాల్లో వింటుంటాం. ముఖ్యంగా ఎన్నికలు వచ్చాయంటే హామీల మీద హామీలు గుప్పిస్తుంటారు. అయితే.. తామేం తక్కువా అన్నట్లు బీజేపీ కూడా నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లు హామీలిస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కూడా కాలేదు. వచ్చే ఎన్నికల కోసం టికెట్ కౌంటర్‌‌ను బీజేపీ ఓపెన్ చేసిందని ప్రచారం జరుగుతోంది. హాట్ ఫేవరేట్ సీట్లను ముందుంచి మరీ బడా నేతలకు గాలం వేస్తోంది.

Also Read: టెన్షన్.. టెన్షన్: శుక్రవారం పూట పాతబస్తీకి కార్పొరేటర్లతో బండి సంజయ్

ముఖ్యంగా జమిలీ ఎన్నికల ముచ్చట వినిపిస్తుండడంతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా విశాఖ నుంచి గతేడాది జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లను తెచ్చుకున్న మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణను.. వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగా బరిలోకి దింపాలనుకుంటున్నారు. ఆయనను బీజేపీలోకి తెచ్చి పోటీ చేయిస్తే గెలుపు గ్యారంటీ అని ఆ పార్టీ భావిస్తోంది. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం.

ఇప్పుడు సడెన్‌గా ఈ సీటు విషయంలో బీజేపీ తరఫున మరోపేరు కూడా వినిపిస్తోంది. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ను కూడా బీజేపీ రెడీ చేస్తోందని మరో సైడ్‌ నుంచి వినిపిస్తున్న మాట. విశాఖ పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపులకు మంచి బలం ఉంది. అందువల్ల ఆ సామాజికవర్గం బలం, గంటా వ్యక్తిగత ఇమేజ్, బీజేపీకి ఉన్న పట్టు ఇవన్నీ కలిస్తే విశాఖ లోక్‌సభ సీటును బంపర్ మెజార్టీతో కైవసం చేసుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారట. అందుకోసం గంటాను ఇప్పటినుంచే దువ్వుతున్నారని టాక్.

Also Read: ఏపీ ప్రజలపై వరాలకు జగన్ రెడీ!

ఈ మధ్యనే బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్న కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కన్ను కూడా విశాఖ మీదనే పడిందట. ఆమె 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచే గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడినా 2024 నాటికి తనకు సేఫెస్ట్ సీటు ఇదేనని ఆమె భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలోని ఒక వర్గం కూడా పురందేశ్వరి విశాఖ నుంచి బరిలో ఉంటారని చెబుతోంది. ఇక ఆమె సామాజిక వర్గం పలుకుబడి గట్టిగా ఉంది. రాజకీయంగా ఎక్కువ సార్లు కమ్మలు గెలుచుకున్న సీటు ఇది. దాంతో ఈ సీటు వదులుకోరాదని బీజేపీలోని ఆ వర్గం కూడా భావిస్తోందట. మొత్తంగా చూస్తే.. హాట్‌ సీట్లను ఏవేవి అయితే ఉన్నయో ఇప్పటి నుంచే అక్కడ అభ్యర్థులను సెట్‌ చేసే పనిలో బీజేపీ పడినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్