https://oktelugu.com/

జగన్‌తో ట్వంటీ ట్వంటీ ఆడేసుకున్న 2020

ఈ ఏడాది కరోనా ప్రపంచ దేశాలతో ట్వంటీ ట్వంటీ ఆడేసుకుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ 2020 సంవత్సరం ఎవరికీ పెద్దగా అచ్చిరాలేదు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా ఈ ఇయర్‌‌ పెద్దగా బాగోలేదనేది స్పష్టమవుతోంది. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించిన ఏ పనులు కూడా వర్కవుట్‌ కాలేదు. అమరావతి వేదికగా చంద్రబాబు ప్రకటించిన రాజధానిని కాదని.. గత డిసెంబర్‌‌ శీతాకాల సమావేశాల్లో మూడు రాజధానుల ప్రకటన చేశారు జగన్‌. చలి సీజన్ లో వేడి పుట్టించారు. ఆ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2020 / 10:03 AM IST
    Follow us on


    ఈ ఏడాది కరోనా ప్రపంచ దేశాలతో ట్వంటీ ట్వంటీ ఆడేసుకుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ 2020 సంవత్సరం ఎవరికీ పెద్దగా అచ్చిరాలేదు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా ఈ ఇయర్‌‌ పెద్దగా బాగోలేదనేది స్పష్టమవుతోంది. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించిన ఏ పనులు కూడా వర్కవుట్‌ కాలేదు. అమరావతి వేదికగా చంద్రబాబు ప్రకటించిన రాజధానిని కాదని.. గత డిసెంబర్‌‌ శీతాకాల సమావేశాల్లో మూడు రాజధానుల ప్రకటన చేశారు జగన్‌. చలి సీజన్ లో వేడి పుట్టించారు. ఆ తరువాత ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి మరీ మూడు రాజధానుల బిల్లు ఆమోదించారు.

    Also Read: ఏపీ ప్రజలపై వరాలకు జగన్ రెడీ!

    ఇక అడ్డేముంది చలో వైజాగేనని అందరూ అనుకున్నారు. కానీ.. దానికి బ్రేక్‌లు పడ్డాయి. అమరావతి వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో మూడు రాజధానుల బిల్లు చట్టంగా మారడానికి ఆరు నెలలు పడితే అది ఇప్పుడు ఇంకా న్యాయ స్థానాల్లో విచారణలోనే ఉంది. ఇక మార్చి వెళ్లేలోపు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేసుకుని పార్టీని రూట్ లెవెల్ వరకూ బలోపేతం చేద్దామని, ప్రభుత్వ పదవులు అన్నీ ఏకమొత్తంగా వైసీపీ పరం చేద్దామని జగన్ అద్భుతమైన ప్లాన్ వేశారు. అనుకున్నట్లుగా మార్చిలో స్థానిక ఎన్నికలు జరిగితే జగన్ కోరుకున్నది జరిగేదే. ఈపాటికి పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా మొత్తం వైసీపీ వారే పదవుల్లో కొనసాగేవారు.

    కానీ.. అక్కడి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ట్విస్ట్‌కు వైసీపీ గిలగిలా కొట్టుకుంది. చివరకు స్థానిక ఎన్నికలు ఎటూ కాకుండా పోయాయి. ఇక ఎన్నికల సంఘంతో కొత్త పంచాయితీ మొదలైంది. అది ఆరని మంటలా కొనసాగుతూనే ఉంది. జగన్ సీఎం సీటు ఎక్కిన ముహూర్తం ఎలా ఉందో ఏమో కాదు కానీ.. గత పాలకులు ఎవరూ పడని కష్టాలు కరోనాతో జగన్ పడ్డారు. అప్పటికి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇంకా గట్టిగా సీట్లో కుదురుకోలేదు. కానీ అంతు పట్టని మహమ్మరిలా కరోనా వచ్చిపడిపోయింది. ఇది దేశమంతా ఉన్నా ఏపీ పరిస్థితి భిన్నం. ఆర్థిక ఇబ్బందులు.. రాజకీయ సవాళ్లతో సతమవుతున్న జగన్‌కు కరోనాతో యుద్ధం చేయడం అతి పెద్ద కష్టంగానే మారింది.

    Also Read: టెన్షన్.. టెన్షన్: శుక్రవారం పూట పాతబస్తీకి కార్పొరేటర్లతో బండి సంజయ్

    ఇక ఏడాది చివరలో ఏలూరులో వింత జబ్బు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యలో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు ఒక్కటేంటి జగన్ సర్కార్‌‌కు నిద్రలేని రాత్రులే గడిచాయి అని చెప్పాలి. ఈ ఏడాది ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ ఎంపీ రెబెల్‌గా మారి వారి కంటే ఎక్కువగా జగన్‌కు తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామరాజు. ఆయన జగన్‌ను, పార్టీని తూర్పార పట్టిన విధానం చూసిన వారు జగన్ మీద జాలి పడడం కంటే ఏమీ చేయలేని పరిస్థితి. వైఎస్సార్‌‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ మీద డైరెక్ట్ గా బాణాలు వేయడమే కాదు, ఘాటైన విమర్శలే చేశారు. మొత్తంగా చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు సాధించి బంపర్‌‌ హిట్‌ కొట్టిన సంబురం జగన్‌కు చాలా కాలం లేకుండానే పోయింది. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు నిద్రలేకుండా చేశాయి. అందుకే.. ఈ 2020 సంవత్సరం జగన్‌కు బ్యాడ్‌ ఇయర్‌‌ అనే చెప్పాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్