AP Women Commission: ఏపీలో నవ్వుల పాలైన మహిళా కమిషన్

వారాహి యాత్రలో భాగంగా పవన్ వాలంటీర్ల పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. దీని వెనుక వాలంటీర్ల వ్యవస్థ ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

Written By: Dharma, Updated On : July 27, 2023 5:02 pm

AP Women Commission

Follow us on

AP Women Commission: ఏపీలో మహిళా కమిషన్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. మహిళల అదృశ్యం పై చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. ఇది జరిగి రెండు వారాలు దాటుతున్నా పవన్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. మహిళా కమిషన్ నుంచి సైతం ఎటువంటి స్పందన లేదు.

వారాహి యాత్రలో భాగంగా పవన్ వాలంటీర్ల పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. దీని వెనుక వాలంటీర్ల వ్యవస్థ ఉందని అనుమానం వ్యక్తం చేశారు.దీనిని తప్పుపడుతూ మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.ప్రభుత్వ శాఖలు సమర్థంగా పనిచేయకపోవడం వల్లే వలంటీర్లను ప్రభుత్వం నియమించింది అని చెప్పుకొచ్చారు. అయితే రెండు వారాలు దాటుతున్నా పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు.

సాధారణంగా నోటీసులు ఇచ్చిన తరువాత ..స్పందన లేకుంటే మహిళా కమిషన్ స్పందించే తీరు ఇలానే ఉంటుందా?ఇప్పుడు ఏపీలో ఇదే చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటికే పవన్ను ప్రశ్నించేందుకు ప్రాసిక్యూషన్కు అనుమతించారు. వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులతో కేసులు కూడా పెట్టించారు. కానీ మహిళా కమిషన్ నుంచి స్పందన లేకపోవడం విశేషం. చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ పదవీకాలం ముగియడం, కేంద్రం నుంచి స్పష్టత రావడంతో డొల్లతనం తేలిపోయింది.

రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమైనట్టు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో సభ్యుల ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. అదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ అచేతనంగా మారింది. ముగిసిన పదవీకాలం పరిగణ లోకి తీసుకోకుండా వాసిరెడ్డి పద్మ అతిగా స్పందించారు. దీంతో అత్యున్నత మహిళా కమిషన్ నవ్వుల పాలయింది. పవన్ విషయంలో అతిగా స్పందించి చేతులు కాల్చుకుంది.