https://oktelugu.com/

PM Modi vs Opposition parties : అవిశ్వాసం పెట్టి మోడీకి బంగారు అవకాశం కల్పించిన ప్రతిపక్షాలు

ఈ నేపథ్యంలోనే నాడు 2019లో మోడీ 2024లో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై జోస్యం చెప్పారని భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2023 / 03:26 PM IST
    Follow us on

    PM Modi vs Opposition parties : ప్రపంచంలోనే గొప్పగా పుంజుకున్న భారత ఎకానమీ.. రెండో వైపు ప్రపంచంలోనే అగ్రగామిగా నవభారత్ నిర్మాణం. మోడీ ప్రభుత్వం నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఎగ్జిబిషన్ సెంటర్) టాప్ 10 ప్రపంచంలోని సెంటర్లలో ఒకటి. ఇందులో మోడీ తొలి ప్రసంగం అద్భుతంగా సాగింది. వచ్చే 25 ఏళ్లలో భారత్ లక్ష్యమేంటి? భారత్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది? ఎలా అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుందో వివరించారు.

    గత 9 ఏళ్లలో కల్పించిన మౌళిక వసతుల కల్పన.. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు కలిపి చెప్పిన మోడీ తీరు చూస్తే ఎంత ఆత్మవిశ్వాసమో మనకు కనిపించింది. దేశాన్ని 2024 తర్వాత ప్రపంచంలో 3వ స్థానంలోకి తీసుకెళతామని తెలిపారు.

    ఇంత చేస్తున్న మోడీపై దేశంలోని ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీపై దేశంలోని పలు విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించాయి. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చాయి. ప్రజాస్వామ్యం అన్నాకా ఎటువంటి విషయాలు సాధారణమైనప్పటికీ.. బుధవారం ప్రకటించిన అవిశ్వాస తీర్మానమే అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 2019లో మోడీ చెప్పిన జోస్యమే నిజమైందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాల క్రితం మోడీ చేసిన వ్యాఖ్యల వీడియోను భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో మరొకసారి పోస్ట్ చేసింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతున్నది.

    2019 ఫిబ్రవరి 7న ఇలాగే అవిశ్వాస తీర్మానం పెట్టారు. అప్పుడు మోడీ మాట్లాడుతూ విపక్ష పార్టీలు 2023 లోనూ అవిశ్వాస తీర్మానాన్ని సిద్ధం చేసుకోవచ్చని అన్నారు. ఏడాది క్రితమే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించిన విషయాన్ని నాడు మోడీ మాట్లాడుకుంటూ ప్రస్తావించారు. ” ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇలాంటి ఉత్సాహమే నేను కోరుకునేది. 2023 లోనూ మీకు ఇలాంటి అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చే అవకాశం కలుగుతుంది. మీకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అని మోడీ వ్యాఖ్యానించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు నవ్వులు చిందించారు. గట్టిగా బల్లులు చరిచారు. ” సమర్పణ, సేవా భావంతో ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. అహంకార భావంతో 400 మంది ఎంపీలు ఉన్నవారు 40 మంది సభ్యులకు పడిపోయారు” అంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి చురుకలు అంటించారు. వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి మోడీ, విపక్ష పార్టీ నాయకురాలు సోనియా గాంధీ సభలోనే ఉన్నారు.

    ఈ నేపథ్యంలోనే నాడు 2019లో మోడీ 2024లో ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై జోస్యం చెప్పారని భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    అవిశ్వాసం పెట్టి మోడీకి బంగారు అవకాశం కల్పించిన ప్రతిపక్షాలపై తీరుపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.