SPG Commando: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రత చాలా ప్రత్యేకం. ఇందులో మహిళా కమాండోలను నియమించడం చాలా ప్రత్యేకమైన విషయం. భారతదేశంలో మొదటిసారి, ప్రధాని భద్రతకు సంబంధించి మహిళా కమాండోలను చేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క భద్రతను చూసుకోవడానికి ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‘ (ఎస్‌పీజీ) వంటి అత్యంత శిక్షణ పొందిన ప్రత్యేక బృందం పనిచేస్తుంది. ఇందులో మహిళా కమాండోలు కూడా ఉన్నారు, వారు ప్రధానమంత్రికి సంబంధించి అత్యంత కఠినమైన పరిస్థితులలో కూడా కీలకమైన భద్రతను అందిస్తున్నారు. మహిళా కమాండోలను ప్రత్యేకంగా ఎంపిక చేయడంలో వారి శారీరక శక్తి, మానసిక దృఢత్వం, మరియు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పనిచేసే సామర్థ్యం ప్రధాన కారణాలు. వారు శిక్షణ పొందిన తర్వాత, మహిళా కమాండోలకు ప్రత్యేక భద్రతా విధులు అప్పగించబడ్డాయి. ఇవి నేరుగా ప్రధాని భద్రతలో భాగమైన అత్యంత నమ్మకమైన, నిపుణులైన అధికారిగా వారి పాత్రను నిరూపించాయి. మహిళా కమాండోలు ప్రస్తుతం తమ సామర్థ్యంతో మాత్రమే కాకుండా, సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా కూడా పనిచేస్తున్నారు. భారతదేశంలో మహిళలు భద్రతా బృందాలలో కీలక స్థానాలను చేపట్టడం, కేవలం మహిళల శక్తి, సామర్థ్యాలను గుర్తించడం కాకుండా, సమాజంలో మహిళలకు ఇవ్వబడే గౌరవాన్ని, అవకాశాలను పెంచేందుకు కూడా ఒక సంకేతంగా భావించవచ్చు.
నెట్టింట వైరల్..
ప్రధాని మోదీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అంతా చర్చ జరుగుతోంది. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఫొటోనే ఇందుకు కారణం. పార్లమెంటు వద్ద ప్రధాని నడుస్తుండగా ఆయన వెనుక ఓ మహిళా భద్రాతా సిబ్బంది ఉన్నారు. ఈ ఫొటోను కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీంతో అది వైరల్ అవుతోంది. అయితే దీనికి కంగన ఎలాంటి కాప్షన్ ఇవ్వలేదు. ఆమె కూడా ఎస్‌పీజీలో సభ్యురాలు అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫొటోపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహాళా ఎస్‌పీజీ కమాండోలు క్లోజ్ ప్రొటక్షన్ టీంలో ఉన్నారని తెలిపాయి. అయితే కంగనా షేర్ చేసిన ఫొటోలో ఉన్నది మాత్రం మహిళా కమాండో ఎస్పీజీలో భాగం కాదని పేర్కొంది.
రాష్ట్రపతి సెక్యూరిటీ ఆఫీసర్..
ఈ ఫొటోలో ప్రధాని వెనుక ఉన్న మహిళా కమాండో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన సిబ్బందిలో ఒకరు అని తెలిపింది. ఎంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. ఆమె పేరు, ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో ప్రధానులు, వారి కుటుంబాల భ6దత కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే 1985లో ఎస్‌పీజీ ఏర్పాటైంది. మాజీ ప్రధానులతోపాటు, ప్రస్తుత ప్రధాని, వారి కుటుంబ సభ్యుల భద్రతను ఈ బృందం పర్యవేక్షించేది. తర్వాత మార్పులు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ భద్రత లభిస్తుంది.