Akkineni Nagarjuna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్కనివిని ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో అక్కినేని హీరోలు కూడా ఉండడం విశేషం… నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగార్జున నాగచైతన్య, అఖిల్ వరకు అందరు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక తమదైన రీతిలో సత్తా చాటుకునే విధంగా అక్కినేని హీరోలు మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు…
అక్కినేని ఫ్యామిలీ నుంచి రెండోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కెరియర్ మొదట్లో వరుసగా ఫ్లాప్ లను మూటగట్టుకున్నాడు. ఇక రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాతో ఒక్కసారిగా ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు తన ప్రస్థానాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తన వందో సినిమా కోసం విపరీతమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు 99 సినిమాలను కంప్లీట్ చేసిన ఆయన హీరోగా తన వందో సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించి భారీ సక్సెస్ సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దానికోసం చాలామంది దర్శకులు చెప్పే కథలను వింటున్నప్పటికి ఆయనకి ఏ కథ నచ్చడం లేదు.
మరి ఆయన ఇప్పుడు ఎవరితో తన వందో సినిమాని చేయబోతున్నాడనే విషయం మీద కొంతవరకు సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున మంచి కథ దర్శకుడు దొరికే వరకు సినిమాను చేయకూడదని పట్టు పట్టుకొని కూర్చున్నాడట. ఇక అందులో భాగంగానే విక్రమ్ కే కుమార్ ఒక కథను వినిపించాడు.
ఆ కథ నచ్చినప్పటికి విక్రమ్ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తాడా లేదా అనే ఉద్దేశ్యం తోనే నాగార్జున దాన్ని హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక అంతకు మించిన కథ ఎవరైనా చెబితే ఆ సినిమాని తన వందో సినిమాగా చేస్తానని లేకపోతే విక్రమ్ కే కుమార్ చెప్పిన కథకే తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున ఒక పని చేస్తున్నాడు అంటే దానిని రెండు మూడు రకాలుగా ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందుకే ఆయన బిజినెస్ మాన్ గా, స్టార్ హీరోగా సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఇక మొత్తానికైతే నాగార్జున లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చాలా చేంజ్ ఓవర్లు ఉన్న క్యారెక్టర్ లను చేస్తూ సక్సెస్ ఫుల్ గా నిలుస్తూ వస్తున్నాడు…