https://oktelugu.com/

New Ration Cards : ఏపీలోని మూడు లక్షల మందికి గుడ్ న్యూస్ ఇదీ..

ఏడాదికి పైగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఏపీలో నిలిచిపోయింది. లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వాటికి మోక్షం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 29, 2024 / 11:12 AM IST

    New Ration Cards

    Follow us on

    New Ration Cards: మరో ఎన్నికల హామీ దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.అర్హులకు రేషన్ కార్డులు అందించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అర్హులకు రేషన్ కార్డులు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ నుంచి నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది.డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని..అదే నెల 28 వరకు ప్రక్రియ కొనసాగనుందని సమాచారం. వైసిపి హయాంలో సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే చాలాకాలంగా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. వాస్తవానికి 2024 జనవరి నుంచి చాలామంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో చాలామంది కార్డు ల కోసం ఎదురుచూస్తున్నారు. చేర్పులు మార్పులతో పాటు కొత్తగా వివాహం చేసుకున్న వారు సైతం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో అర్హులకు రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    * దరఖాస్తుల స్వీకరణ
    డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అందులో అర్హులను గుర్తించికొత్త డిజైన్లతో రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. వచ్చే సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి.. పండుగ కానుకగా రేషన్ కార్డులు చేయాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడు లక్షల కార్డుల జారీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    * చేర్పులు, మార్పులకు అవకాశం
    మరోవైపు రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పులకు సైతం అవకాశం ఇవ్వనున్నారు. అదే సమయంలో వైసీపీ హయాంలో చాలామంది అనర్హులు రేషన్ కార్డులు దక్కించుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ఫేక్ సర్టిఫికెట్లతో చాలామంది దివ్యాంగ పింఛన్లు దక్కించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే వాటిపై విచారణ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల వరకు అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతోకార్డులు దక్కించుకున్న అనర్హులలో ఒకరకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.