https://oktelugu.com/

Illegal relationship : మొగుడికి ఎఫైర్ ఉందని జిమ్ కెళ్లి మరీ ప్రియురాలిని చితకబాదిన భార్య

Illegal relationship :భర్త ఎలాంటి వెధవ వేశాలు వేసినా వంటింటి కుందేళ్లు లాగా కుక్కిన పేనులాగా ఒకప్పుడు మహిళలు కిక్కురు మనకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మహిళలు అంతరిక్షాల్లోకి కూడా వెళుతున్నారు. దేన్నైనా నిలదీసే సత్తాను సొంతం చేసుకున్నారు. భర్తల చాటు మాటు వ్యవహారాలను ఎండగట్టి అపర ఖాళీల్లా విరుచుకుపడుతున్నారు. ఆది పరాశక్తిలా మారుతున్న అతివలను చూసి మగవాళ్లు బెంబేలెత్తుతున్నారు. కరోనా లాక్ డౌన్ వేళ ఆఫీసుల్లో, బయట భర్తలు పెట్టుకున్న ఎఫైర్లు ఎన్నో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2021 / 01:50 PM IST
    Follow us on

    Illegal relationship :భర్త ఎలాంటి వెధవ వేశాలు వేసినా వంటింటి కుందేళ్లు లాగా కుక్కిన పేనులాగా ఒకప్పుడు మహిళలు కిక్కురు మనకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మహిళలు అంతరిక్షాల్లోకి కూడా వెళుతున్నారు. దేన్నైనా నిలదీసే సత్తాను సొంతం చేసుకున్నారు. భర్తల చాటు మాటు వ్యవహారాలను ఎండగట్టి అపర ఖాళీల్లా విరుచుకుపడుతున్నారు. ఆది పరాశక్తిలా మారుతున్న అతివలను చూసి మగవాళ్లు బెంబేలెత్తుతున్నారు.

    Illigal Affair

    Illigal Affair

    కరోనా లాక్ డౌన్ వేళ ఆఫీసుల్లో, బయట భర్తలు పెట్టుకున్న ఎఫైర్లు ఎన్నో బయటకు వచ్చాయి. ఇప్పుడు కరోనా తగ్గడంతో బయట పెట్టుకుంటున్న బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా భోపాల్ లో ఒక భార్య తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని జిమ్ కు వచ్చి మరీ ఓ యువతిని చితకబాదిన వీడియో వైరల్ గా మారింది.

    భర్తతో ఓ యువతికి వివాహేతరసంబంధం ఉందన్న అనుమానంతో అతడి భార్య రెచ్చిపోయింది. జిమ్ కు వచ్చి ఓ మహిళపై బూట్లతో దాడికి దిగింది. ఆమె జుట్టు పట్టి ఈడ్చుకుంటూ కొట్టింది. ఆ మహిళ ఎంత ప్రతిఘటించినా ఆమె బలం సరిపోలేదు. పక్కనున్న వారు ఆపడానికి ప్రయత్నించినా.. భర్త గట్టిగా నిలువరించినా ఆ భార్య ఆగకుండా రెచ్చిపోయింది.

    ఆ భర్త జిమ్ కు వచ్చి ఆ మహిళ ఎవరో తెలియదని ఎంత మొత్తుకుంటున్నా ఆ భార్య వినకుండా ఆ యువతిపై దాడి చేస్తూనే ఉంది. జిమ్ లో భర్త పక్కనే ఉన్న మహిళను చూసి ఎఫైర్ ఉందని అనుమానించి గొడవకు దిగి చావబాదింది. 30ఏళ్ల మహిళ బుర్ఖా ధరించి ఆమె సోదరితో కలిసి వచ్చి రచ్చ చేసింది.

    అతికష్టం మీద ఈ దాడిని భర్త, ఇతర జిమ్ సభ్యులు ఆపారు. అనంతరం భార్యభర్తలిద్దరూ పోలీస్ స్టేషన్ లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు.మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    వైరల్ అవుతున్న వీడియో ఇదే..