Ashika Padukune: కథలో రాజకుమారి సీరియల్ ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యారు బెంగళూరు భామ ఆషిక పదుకొనే. స్టార్ మా లో ప్రసారమైన ఈ సీరియల్ లో అవని గా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందారు. ఈ సీరియల్ లో ఆషిక నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఆమె ప్రియుడు, బిజినెస్ మ్యాన్ చేతన్ శెట్టిని … నిన్న వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, ఇండస్ట్రి కి చెందిన కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇప్పుడు వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

చేతన్ తనకు బాగా తెలుసని, లాక్‌డౌన్‌లో తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆషికా ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పెళ్లి తర్వాత కూడా తాను సీరియల్స్‌లో నటిస్తానని స్పష్టం చేసింది ఈ భామ. కాగా కథలో రాజకుమారి సీరియల్ ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన ఆషికా… తొలి సీరియల్‌తోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది.
ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ రీల్స్ లో తోటి నటి నటీమణులతో కలిసి … ప్రేక్షకులను అలరిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. అలా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆషిక పదుకొనే. అయితే గతేడాది బెంగళూరులోని ఓ హోటల్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఫోటో లు ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుండగా … పలువురు టివి ప్రముఖులు వీరికి శుబకాంక్షలు తెలియ జేస్తున్నారు. సోషల్ మీడియా లో ఆమె అభిమానులు ఆ ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెప్తున్నారు.