దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ సగటు ఎక్కువ

తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఇటీవలే ప్రారంభమయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రారంభమైన ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివాడీగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త బిల్లులను తీసుకొచ్చి అసెంబ్లీ ఆమోదించుకుంటోంది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త రెవిన్యూ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం పొందింది. కరోనా నివారణకు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు వంటి అనేక అంశాలు సభలో చర్చకు వచ్చాయి. నేడు పట్టణాభివృద్ధిపై అసెంబ్లీలో జోరుగా చర్చ నడిచింది. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ […]

Written By: NARESH, Updated On : September 16, 2020 7:59 pm
Follow us on


తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఇటీవలే ప్రారంభమయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రారంభమైన ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివాడీగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కొత్త బిల్లులను తీసుకొచ్చి అసెంబ్లీ ఆమోదించుకుంటోంది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త రెవిన్యూ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం పొందింది. కరోనా నివారణకు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు వంటి అనేక అంశాలు సభలో చర్చకు వచ్చాయి. నేడు పట్టణాభివృద్ధిపై అసెంబ్లీలో జోరుగా చర్చ నడిచింది. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

Also Read: కేంద్రంతో యుద్ధానికి సిద్ధమవుతున్న కేసీఆర్?

దేశ పట్టణీకరణ సగటు కంటే తెలంగాణ పట్టణీకరణ సగటు ఎక్కువని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో 31.2శాతం సగటు ఉంటే తెలంగాణలో మాత్రం 42.6శాతం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఆస్తి పన్ను, నీటి పన్ను పెంచలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఇంటి నిర్మాణాల పనులు సులువుగా చేసుకునేలా ఆన్ లాన్ టీఎస్ బీపాస్ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కార్పొరేషన్ కు కేంద్రం బకాయిలు చెల్లించకున్నా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.హైదరాబాద్ లోని మెట్రోతో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. ఇప్పటికే 69కిలోమీటర్ల మెట్రో మార్గం పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా అక్టోబర్ 2న 11 వేల పబ్లిక్ టాయిలెట్స్  పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 198బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 35వేల మందికి రూ.5కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో త్వరలోనే కొత్త ఆఫీసర్ల కోసం నియామకాలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Also Read: శ్రావణి కేసు రిమాండ్ రిపోర్ట్: నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

వీటితోపాటు ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో గ్రీనరీ కోసం బడ్జెట్లో ప్రభుత్వం 10శాతం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. 2014కు ముందు తెలంగాణలో 24శాతం గ్రీనరీ ఉంటే ప్రస్తుతం 29శాతానికి పెరిగిందని తెలిపారు. ఇక మహబూబ్‌‌నగర్‌‌లో 2,087ఎకరాల్లో కేసీఆర్ ఎకో పార్క్ ప్రారంభించినట్లు తెలిపారు. దీంతోపాటు హెచ్‌‌ఎండీఏ పరిధిలో 103, జీహెచ్ఎంసీ పరిధిలో 587పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేటీఆర్ చెప్పారు.