https://oktelugu.com/

బిగ్ బ్రేకింగ్: కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి

కరోనా బారినపడి వైసీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ప్రాణాలు విడిచారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి కరోనాతో ప్రాణాలు కోల్పోవడం దేశంలోనే విషాదం నింపింది. పార్లమెంట్ సమావేశాల వేళ ఈ ఘటన జరగడం కలిచివేసింది.చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఎంపీ దుర్గా ప్రసాద్ కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. Also Read: ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు.. సజ్జల కీలక వ్యాఖ్యలు దుర్గాప్రసాద్ కు నెలరోజుల కింద కరోనా సోకింది. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2020 7:42 pm
    Follow us on

    కరోనా బారినపడి వైసీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ప్రాణాలు విడిచారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి కరోనాతో ప్రాణాలు కోల్పోవడం దేశంలోనే విషాదం నింపింది. పార్లమెంట్ సమావేశాల వేళ ఈ ఘటన జరగడం కలిచివేసింది.చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఎంపీ దుర్గా ప్రసాద్ కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

    Also Read: ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

    దుర్గాప్రసాద్ కు నెలరోజుల కింద కరోనా సోకింది. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఉబకాయంతో పాటు భారీ శరీరం ఉండడం.. అంతకుముందే శ్వాసకు సంబంధించి సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆయన నెలరోజులుగా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. కోలుకోవడం లేదు. ఆయన అవయవాలన్నీ కూడా చెడిపోయాయని.. బతకరని వైద్యులు తెలిపారు. తాజాగా పరిస్థితి విషమించి చనిపోయారు.

    దుర్గాప్రసాద్ స్వస్థలం నాయుడు పేట మండలం భీమవరం. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తిరుపతి ఎంపీ మరణంతో వైసీపీలో విషాద చాయలు అలుముకున్నాయి.

    నెల్లూరు జిల్లా గూడురు అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా దుర్గప్రసాద్ గెలిచాడు. ఆయన 1985, 1994,1999, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి కూడా చేపట్టారు. 1996 నుంచి 98 వరకు విద్యాశాఖ మంత్రిగా చేశారు.

    Also Read: దేవాలయాల లొల్లి.. రంగంలోకి చంద్రబాబు

    28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

    దుర్గాప్రసాద్ 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయల వైపు అడుగులు వేశారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు.