https://oktelugu.com/

పెళ్లి అయ్యాక కూడా హీరో గ్యాప్ ఇవ్వట్లేదు !

హీరో నితిన్ రీసెంట్ గా పెళ్ళితో బ్యాచరల్ లైఫ్ కి శుభం కార్డ్ వేసి.. ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే పెళ్లి అయినా, సినిమాల వేగాన్ని మాత్రం తగ్గించను అంటున్నాడు నితిన్. ఇప్పటికే వరుసగా సినిమాల్ని ఒప్పుకున్నాడు. నితిన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మరో రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ముందు వరకూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ […]

Written By:
  • admin
  • , Updated On : September 16, 2020 / 07:09 PM IST
    Follow us on


    హీరో నితిన్ రీసెంట్ గా పెళ్ళితో బ్యాచరల్ లైఫ్ కి శుభం కార్డ్ వేసి.. ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే పెళ్లి అయినా, సినిమాల వేగాన్ని మాత్రం తగ్గించను అంటున్నాడు నితిన్. ఇప్పటికే వరుసగా సినిమాల్ని ఒప్పుకున్నాడు. నితిన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మరో రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ముందు వరకూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ చేసిన నితిన్.. సమ్మర్ లో ఆ సినిమాని రిలీజ్ చేసి.. తన పెళ్లికి అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు. కానీ, మధ్యలో కరోనా రావడం, గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న పెళ్లిని కూడా సింపుల్ గా ముగించడం.. చకచకా జరిగిపొయాయి. అయితే ‘రంగ్ దే’ సినిమాని సంక్రాతి సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేయాలాని నితిన్.. ‘రంగ్ దే’ టీంతో స్పష్టం చేశాడట. షూటింగ్ కూడా అక్టోబర్ లో స్టార్ట్ చెద్దామని షూట్ ఫిక్స్ చేశాడట.

    Also Read: డ్రగ్ కేసు: సుశాంత్ ఫామ్ హౌజ్లో సారా.. రియా పార్టీలు?

    మొత్తానికి నితిన్ పెళ్లి అయ్యాక నాలుగు నెలలు కూడా గ్యాప్ తీసుకునేలా లేడు. ‘రంగ్ దే’ సినిమా తరువాత వెంటనే చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చేస్తోన్న సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేస్తాడట. ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని.. సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అందుకే ఆ టైటిల్ పెడుతున్నారని తెలుస్తోంది. ఎలాగూ యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి కాబట్టి.. ఇక ఈ సినిమా కూడా అలాగే మిస్టరీ నేపథ్యంలోనే ఉంటుంది కాబట్టి టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇక ఈ ‘చదరంగం’ చిత్రంతో పాటు నితిన్ మరో సినిమా కూడా చేస్తున్నాడు.

    Also Read: హీరోగారి భారీ డిమాండ్లు.. ఇలా అయితే కష్టమే !

    కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమాలోనే నితిన్ ఏభై ఏళ్ల వ్యక్తిగా అలాగే ఎనభైకి పై బడిన ముసలాడిలా కూడా కనిపిస్తోన్నాడు. ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని అ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. ఆ లెక్కన నితిన్ రాబోయే సినిమాలన్ని కాస్త ఆసక్తిగానే ఉండబోతున్నాయి. తన లాస్ట్ సినిమా ‘భీష్మ’తో భారి స్థాయిలో ఆకట్టుకోని సూపర్ హిట్ కొట్టిన నితిన్, ఆ సక్సెస్ ను కొనసాగించాడానికి తన తదుపరి సినిమాల పై మరింత దృష్టి పెట్టి ఈ సినిమాలు చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు చేస్తోన్న సినిమాల్లో ఒక సినిమాకి మరో సినిమాకి చాల వినూత్నంగా అనిపిస్తున్నాయి.