విద్యార్థుల భవిష్యత్తును దృష్టితో కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పది, పన్నెండు తరగతుల పరీక్షలు రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాురు. కానీ ఏపీ మాత్రం పరీక్షలు జరిపి తీరుతామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షలపై ప్రకటన చేశారు. పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేశామని చెప్పారు. తరువాత నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ర్టాలు పరీక్షలు రద్దు చేసినా ఏపీ మాత్రం రద్దు చేయకపోవడం గమనార్హం.
అన్నిబాగుంటే జూన్ లో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేది. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా వేశారు. ఏపీ ప్రభుత్వం కరోనా కేసులు తగ్గితే పరీక్షలు పెడతామని చెబుతోంది. అంటే జులైలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించే సరికి జులై పూర్తయిపోతుంది. ఆగస్టులో ఇంటర్ విద్యాసంవత్సరం ప్రారంభిస్తే సెలబస్ ఎప్పటికి పూర్తయి పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పదో తరగతి పరీక్షలపై ఇతర రాష్ర్టాలు తేల్చేశాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను సీబీఎస్ఈ కూడా ఎప్పుడో రద్దు చేసింది. పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా జీపీఏలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఆన్ లైన్ తరగతులకు కూడా పచ్చ జెండా ఊపింది. తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ ప్రారంభం అయింది. పరీక్షలు రాయకపోతే విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలంటూ ఏపీ సర్కారు వాదనలు వినిపిస్తోంది.
కానీ ఏ రాష్ర్టంలో టెన్త్ పరీక్షలు జరగడంలేదు. చివరికి సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేశారు. సాక్షాత్తు మోడీనే పరీక్షలకన్నా విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమంటుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం మాకంటే ఎక్కువ ఎవరికి తెలయదని ప్రశ్నిస్తూ పరీక్షలకు సిద్ధమవతోంది. దీంతో జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.