https://oktelugu.com/

బిహార్‌‌ భవితవ్యం తేల్చనున్న రెండో విడత ఎన్నికలు

బిహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా నడుస్తోంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగియగా.. నేడు రెండో దశ పోలింగ్‌ నడుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 71 స్థానాల్లో తొలి విడతలో ఎన్నికల జరిగాయి. నేడు మరో 94 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ రెండో దశ పోలింగే పార్టీల దశ దిశను మార్చనున్నాయి. సీమాంచల్‌ ప్రాంతంలో జరుగుతున్న ఈ పోలింగ్‌ అన్ని పార్టీలకు ఎంతో కీలకం కానున్నాయి. మరిన్ని జాతీయ రాజకీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2020 / 01:21 PM IST
    Follow us on

    bihar elections

    బిహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా నడుస్తోంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగియగా.. నేడు రెండో దశ పోలింగ్‌ నడుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 71 స్థానాల్లో తొలి విడతలో ఎన్నికల జరిగాయి. నేడు మరో 94 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ రెండో దశ పోలింగే పార్టీల దశ దిశను మార్చనున్నాయి. సీమాంచల్‌ ప్రాంతంలో జరుగుతున్న ఈ పోలింగ్‌ అన్ని పార్టీలకు ఎంతో కీలకం కానున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    మొత్తం సీట్లలో మూడింట రెండు వంతుల స్థానాల్లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలే బిహార్‌‌లో ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్‌ చేస్తారో నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధే మరోసారి తమకు పట్టం కట్టబోతోందని నితీశ్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం తెస్తుందని మహాకూటమి ఆశిస్తోంది. మరోవైపు గతంలో కంటే బిహార్‌‌ అభివృద్ధి మెరుగ్గానే ఉన్నప్పటికీ.. భారీ వరదలు, నిరుద్యోగ సమస్య పెను సవాల్‌గా మారాయి.

    Also Read: అమెరికాలో సామాజికకోణం ఫలితాన్ని నిర్ణయించబోతుందా?

    రెండో విడత ఎన్నికలు పశ్చిమ చంపారన్‌, తూర్పు చంపారన్‌, షియోహర్‌‌, సీతమర్హి, మధుబాని, దర్భంగా, ముజఫర్‌‌పూర్‌‌, గోపాల్‌గంజ్‌, సివాన్‌, సరన్‌, వైశాలి, సమస్థిపూర్‌‌, బెగుసరై, ఖగారియా, భాగల్పూర్‌‌, నలంద, పట్నాలలో జరుగుతున్నాయి. మొత్తంగా 2,85,50,285 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,50,33,034 మంది పురుష ఓటర్లు, 1,35,16,271 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 980 మంది హిజ్రాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 18,823 పోలింగ్‌ కేంద్రాల్లో 41,362 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు.

    Also Read: దుబ్బాక ఎన్నిక: రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందా..

    17 జిల్లాల పరిధిలోని 94 స్థానాల్లో మొత్తం 1,463 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1316 మంది పురుషులు కాగా.. 146 మంది మహిళలు. 94 స్థానాలకు గాను ఆర్జేడీ 56 మంది అభ్యర్థులను బరిలో దింపింది. బీజేపీ 46 మందిని, జేడీయూ 43 మందిని పోటీలోకి దింపాయి. మహాకూటమిలోని కాంగ్రెస్‌ 24 స్థానాల్లో, మూడు వామపక్ష పార్టీలు కలిసి 14 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఒంటరిగా బరిలో ఉన్న ఎల్జేపీ నుంచి 52 మంది పోటీలో ఉన్నారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న వికాశీల్‌ ఇన్సాన్‌ పార్టీ 5 స్థానాల్లో అభ్యర్థులను పెట్టింది.