దుబ్బాక అసెంబ్లీ నియోజవర్గానికి నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ స్థాయిలో ప్రచారం నడిపించాయి. దుబ్బాకకు ఉప ఎన్నికల తేదీ ఖరారైనప్పటి నుంచే రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా నేతలు పొట్లాటకు దిగారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అయితే… తాజాగా తెలుగు టాప్ న్యూస్ ఛానల్‌లో ప్రసారమైన ఓ వార్త ఇప్పుడు సంచలనమైంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ తరపున రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి తలపడుతున్నారు.
Also Read: నామా’కు నామాలు.. టీఆర్ఎస్ లో డమ్మీ అయ్యారా?
మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌లో కొనసాగిన శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించాడు. కానీ.. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఆయనే బరిలో నిలిచారు. అయితే.. శ్రీనివాస్‌రెడ్డి విషయంలో ఓ తెలుగు న్యూస్ చానెల్ ఓ అసత్య ప్రచారానికి తెరతీసింది. ఆయన మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరుతాడంటూ ఓ ఫేక్ వార్తను సృష్టించారు పలువురు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నిక రోజు కూడా హల్‌చల్ చేసింది.
ఈ వార్త చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మరోవైపు ఆ వార్తతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ చానల్ పేరుతో ఫేక్ వార్తను సృష్టించి దుబ్బాక ఎన్నికను ప్రభావితం చేయాలనుకున్నారని సదురు చానెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి కంత్రీగాళ్లపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు న్యూస్ చానెల్ ప్రకటించింది.
Also Read: ఒక్కరోజు జీతం : భగ్గుమంటున్న తెలంగాణ ఉద్యోగులు?