మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్ ద్విపాత్రభినయం చేస్తున్నాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నాడు. ఈ మూవీలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
కరోనాతో ‘ఆచార్య’ షూటింగు నిలిచిపోవడంతో చిరంజీవి తదుపరి ప్రాజెక్టులపై అందరి ఫోకస్ పడింది. ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి ‘వేదాళం’.. ‘లూసీఫర్’ రీమేక్ లలో నటించేందుకు సన్నహాలు చేసుకుంటున్నాడు. వేదాళం మూవీకి మోహర్ రమేష్ దర్శకత్వం వహించనుండగా.. లూసీఫర్ రీమేక్ మూవీకి వీవీ.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు.
Also Read: పెళ్లిపై.. ఫుల్ క్లారిటీగా ఉన్న బొమ్మాళీ అనుష్క..!
లూసీఫర్ మూవీ కంటే ముందుగా ‘వేదాళం’ రీమేక్ తెరకెక్కనుందని సమాచారం. తమిళ్ లో సూపర్ హిట్టయిన వేదాళం మూవీపై మెగాస్టార్ మనసు పారేసుకున్నాడు. ఈ మూవీలో కథానాయకుడి సోదరి పాత్ర కీలకంగా ఉండనుంది. ఈ పాత్రలో కీర్తి సురేష్.. సాయిపల్లవి పేర్లు తెరపైకి రాగా కీర్తి సురేష్ సెట్ అయినట్లు ప్రచారం జరిగింది.
నవంబర్ 4న నెట్ ఫిక్స్ లో కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ స్టీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడింది. తన తర్వాత సినిమాలపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది ‘సర్కారువారిపాట’.. రజనీకాంత్ ‘అణ్ణాత్తే’.. మోహన్ లాల్ తో ఓ మూవీ చేస్తున్నట్లు చెప్పింది.
Also Read: పవన్ వెన్నంటే ఉంటూ దెబ్బేస్తున్న అభిమానులు..!
బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘మైదాన్’ నటిస్తున్నట్లు వార్తల్లో నిజం లేదని కీర్తి సురేష్ తేల్చిచెప్పింది. అయితే చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ పై మాత్రం కీర్తి స్పందించలేదు. దీంతో ఈ మూవీలో కీర్తి నటిస్తుందా? లేదా అనుమానాలు కలుగుతున్నాయి. వేదాళం సినిమా ఇంకా అగ్రిమెంట్ దశలోనే ఉన్నందున ఆమె స్పందించలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే కీర్తి సురేష్ చిరంజీవి సినిమాపై దాటవేసిందనే టాక్ విన్పిస్తోంది.