https://oktelugu.com/

చంద్రబాబుకు సీన్ రివర్స్ అవుతోంది..!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ స్టైల్ మారినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు థర్ఢ ప్లేస్లో కూడా లేని కమలం పార్టీ రాను రాను ప్రధాన ప్రతిపక్షంగా మారబోతుందా..? అన్న పరిస్థతి కనబడుతోంది.  నాయకత్వం మార్పుతోనే ఇది సాధ్యమైందని కొందరు బీజేపీ నాయకులు అంటుండగా మరికొందరు టీడీపీ బలహీనపడడంతోనే బీజేపీ ఎదుగుదలకు కారణమవుతోందని చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చిన తరువాత పార్టీలో  కొంత మార్పు వచ్చందని అనుకుంటున్నారు. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 10:41 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ స్టైల్ మారినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు థర్ఢ ప్లేస్లో కూడా లేని కమలం పార్టీ రాను రాను ప్రధాన ప్రతిపక్షంగా మారబోతుందా..? అన్న పరిస్థతి కనబడుతోంది.  నాయకత్వం మార్పుతోనే ఇది సాధ్యమైందని కొందరు బీజేపీ నాయకులు అంటుండగా మరికొందరు టీడీపీ బలహీనపడడంతోనే బీజేపీ ఎదుగుదలకు కారణమవుతోందని చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చిన తరువాత పార్టీలో  కొంత మార్పు వచ్చందని అనుకుంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    సోము వీర్రాజు ఏపీ బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడు పెంచాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఇటీవల అంతర్వేది ఘటనలో సోము వీర్రాజు నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆ తరువాత కూడా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ  వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్నాడు. అమరావతి రైతుల విషయంలోనూ వారి పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

    Also Read: హైదరాబాద్ అందుకే మునిగింది? ముంపుకు కారకులెవరు?

    ఏపీలో అంతకుముందు బీజేపీ అంటే టీడీపీకి పొత్తు పార్టీ మాత్రమే అనే వాదన ఉండేది. టీడీపీ అధినేత కూడా బీజేపీ నాయకులను అదుపులో పెట్టుకొని ఆ పార్టీని ఎదగనీయకుండా చేశారనే ఆరోపణలు ఉండేవి. ఈ పరిస్థతిని ఆలస్యంగానైనా గమనించిన కేంద్రం సమూల మార్పులు చేయాలని భావించింది. దీంతో పార్టీ నాయకత్వ మార్పే పరిష్కారమనుకొని సోము వీర్రాజుకు పగ్గాలు అప్పజెప్పింది.  రంగంలోకి దిగిన సోము వీర్రాజు  తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ.. అనుకూలంగా ఉండేవారిని ఆయా పదవుల్లో నియమిస్తున్నారు. సోము చర్యలు తీసుకున్న బీజేపీ నాయకుల్లో ఎక్కువగా చంద్రబాబుకు మద్దతుదారులేనని తెలుస్తోంది.

    ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమంటే తెలుగుదేశం పార్టీ పేరు మాత్రమే వినిపించేది. కానీ సోము వీర్రాజు ఆ పేరును తుడిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోని కీలక నాయకులు,  అయితే వైసీపీ లేదా బీజేపీలో చేరుతుండడంతో ఈ రెండు పార్టీలు మాత్రమే బలపడుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఏదో ఒక పార్టీలో చేరితో కలిసివచ్చే అవకాశం ఉంటుందనే భావనతో టీడీపీ నాయకులు పార్టీని వీడుతున్నారు. దీంతో మెల్లమెల్లగా బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్ పరిస్థతి ఇప్పడు అంతగా బాగోలేనందున ఇక ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదుగుతుందనడంలో అతిశయోక్తి కాదు.

    Also Read: అమెరికా ఎన్నికల ఫలితాలు తీవ్ర ఆలస్యం?

    ఈ పరిణామాలతో చంద్రబాబు తీవ్ర మనస్థాపం చెందుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పడు బీజేపీ నాయకులు చంద్రబాబుకు మద్దతు ఇస్తూ ఆయన చెప్పిందే వేదం అనుకున్న  సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పడు పరిస్థతి మారడంతో తీవ్ర ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరి బాబు టీడీపీ పటిష్టానికి ఎలాంటి ప్లాన్ వేస్తాడో చేడాలి మరి.