https://oktelugu.com/

సమస్యల సుడిగుండంలో జగన్‌ సర్కార్‌‌

తండ్రి అంత పెద్ద నాయకుడైనా.. తండ్రి మరణానంతరం ఒంటరిగా ఎదిగిన నేత వైఎస్‌ జగన్‌. అందుకే ఆయనను అభిమన్యుడిలా పిలుస్తుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్‌ను ఎదిరించాడు. కొండను ఢీ కొట్టాడు. కేంద్రం పెద్దలతో ఫైట్‌కు దిగాడు. దాని పర్యవసాన్ని కూడా జగన్‌ అనుభవించారు కూడా. పదేళ్ల తరువాత అధికారం చేతిలో పడింది. ఇక జగన్‌ కష్టాలు తీరినట్లేనని అందరూ భావించారు. కానీ.. కష్టాలు తీరడం ఏమోకానీ ఇంకా కొత్తవి వచ్చి చేరుతున్నాయి. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 10:44 AM IST
    Follow us on


    తండ్రి అంత పెద్ద నాయకుడైనా.. తండ్రి మరణానంతరం ఒంటరిగా ఎదిగిన నేత వైఎస్‌ జగన్‌. అందుకే ఆయనను అభిమన్యుడిలా పిలుస్తుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్‌ను ఎదిరించాడు. కొండను ఢీ కొట్టాడు. కేంద్రం పెద్దలతో ఫైట్‌కు దిగాడు. దాని పర్యవసాన్ని కూడా జగన్‌ అనుభవించారు కూడా. పదేళ్ల తరువాత అధికారం చేతిలో పడింది. ఇక జగన్‌ కష్టాలు తీరినట్లేనని అందరూ భావించారు. కానీ.. కష్టాలు తీరడం ఏమోకానీ ఇంకా కొత్తవి వచ్చి చేరుతున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    పదేళ్ల కష్టం తర్వాత జగన్‌కు సీఎం పీఠం దక్కింది. అయితే.. ఆ సంబరం ఆయనకు ఎన్ని రోజులు నిలవలేదు. ఎందుకంటే.. రాష్ట్ర ఖజానాను చూసిన సీఎం జగన్ ఖంగుతిన్నారు. కేవలం రూ.130 కోట్లను మాత్రమే ఖజానాలో ఉంచి బాబు కుర్చీ దిగిపోయారని ప్రచారం జరుగుతుంటుంది. దీంతో ఖాళీ అయిన ఆర్థిక వ్యవస్థతో జగన్ కుస్తీ పడుతూనే ఉన్నారు. ఇక అమరావతి రాజధానిని కోరి కెలుక్కున్నారా లేక‌ జగన్ అజెండా అదేనా అన్నది తెలియకుండా ఉంది. మూడు రాజధానుల అంశం కోర్టులో పడి జగన్ ఆశలను ఒక్కసారిగా చల్లార్చేసింది. ఇదిలా ఉంటే కరోనా వచ్చి నష్టాలను మరింత పెంచేసింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా జగన్‌కు శాపంగా మారింది.

    Also Read: చంద్రబాబుకు సీన్ రివర్స్ అవుతోంది..!

    మరోవైపు.. తెలంగాణతో నీటి వనరుల విషయంలో పెట్టుకుంటున్న గొడవతో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ కూడా మెల్లమెల్లగా సైడ్‌ అయిపోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆర్టీసీ టార్గెట్‌ చేశారు ఆయన. ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులు తెలంగాణ భూభాగంలో అడుగుపెట్టరాదని కేసీఆర్ కొత్త ఆంక్షలు విధించారు. అంతర్రాష్ట్ర రవాణా విషయంలో కేసీఆర్ కేవలం ఏపీకి మాత్రమే ఈ కొత్త రూల్స్ పెట్టారు. కర్నాటక, మహారాష్ట్రలకు మాత్రం ఏ విధమైన షరతులు లేవు.

    అయితే.. ఇదంతా జగన్‌ మెతక వైఖరిని చూసి చేస్తున్నారా.. లేక జల వివాదాలు గుర్తువచ్చి పట్టు బిగిస్తున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. లేదా మోడీతో జగన్ చెలిమిని చూసి సహించలేక చేస్తున్నారా అన్నది తెలియదు. ఫలితంగా ఈ దసరా ఏపీ జనాలకు నరకం చూపించింది. ఏపీ పొలిమేరల వరకూ సొంత రాష్ట్రం బస్సులు నడిపితే అది దాటి తెలంగాణ భూభాగంలోకి వెళ్లి మళ్లీ బస్సులు పట్టుకుని గమ్యం చేరుకోవాల్సి వచ్చింది. మరోవైపు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరగా కేంద్రంలోకి మోడీతో జగన్ దోస్తీ చేస్తున్నారు.

    Also Read: జగన్ అత్యుత్సాహం.. బడి పిల్లలకు శాపంగా మారనుందా?

    రాజ్యసభలో బిల్లులకు కళ్లు మూసుకుని మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు పోలవరానికే భారీ టెండర్ పెట్టేశారు మోడీ. జగన్‌ను రాజకీయంగా అతి పెద్ద దెబ్బ కొట్టేశారు. జగన్‌కు వ్యక్తిగతంగానూ, ఏపీ పరంగానూ అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లుగా కోర్టులతో కూడా జగన్ తాజాగా గొడవ పెట్టుకున్నారు. ఈ సమయంలో ఆయన మోడీని ఢీ కొట్టి పోలవరం విషయంలో పోరాడగలరా అన్నది పెద్ద ప్రశ్న. పోరాడలేకపోతే ఏపీకి పోలవరం దక్కకుండా పోతుంది. అదే జరిగితే రాజకీయంగా జగన్‌ చాలా వరకు మైనస్‌ అవుతుంది. ఒకవేళ మోడీని ఢీ కొడితే ఏం జరుగుతుందో ఎవరూ కనీసం ఊహించలేరు. ఇక అప్పుల కుప్పగా ఉన్న ఏపీ కూడా జగన్‌కు మరోవైపు పెను సవాల్ విసురుతోంది. మరి వీటన్నింటి నుంచి జగన్‌ ఎలా బయటపడుతారో చూడాలి.