CM KCR Health: సీఎం కేసీఆర్ సడెన్ గా ఈరోజు ఉదయం యశోదా ఆస్పత్రికి వెళ్లడం సర్వత్రా సంచలనం రేపింది. ఆయన అస్వస్థతకు గురయ్యారని, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారంటూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా ఈ వార్తలపై యశోద ఆసుపత్రి డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అన్నీ బాగానే ఉన్నాయంటూ చెప్పారు. కాగా ఆయన చేయి నొప్పికి గల సమస్యలను కూడా వివరించారు. ఒక వారం రోజులుగా కేసీఆర్ కొంత అస్వస్థతకు గురయ్యారని, ఈ క్రమంలోనే తమ డాక్టర్లు ఆయనకు ఇంటివద్దనే చికిత్స చేస్తున్నట్టు యశోద ఆసుపత్రి వైద్యులు వివరించారు.
Also Read: జనసేనలోకి జన వరద.. ఆవిర్భావ సభ ముందు ఊపు..
ఈ రోజు ఉదయం ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలంటూ సూచించామన్నారు. స్పైన్ ఎమ్మారై, బ్రెయిన్ తో పాటు ఇతర అవయవాలను స్కానింగ్ చేసిన డాక్టర్లు.. కేసీఆర్ మెడ నరంపై ఒత్తిడి పడుతున్నట్లు గుర్తించారు. అక్కడ ఆయనకు కొద్దిగా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నట్లు చెప్పారు. ఎక్కువగా ఐ ప్యాడ్స్, పేపర్ చదవడం వల్ల ఇది వస్తుందని వివరించారు. వయసుతో పాటు ఉ సర్వ సాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని కేసీఆర్ కూడా అదే జరిగిందని చెప్పారు.
దీనికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటూ తెలిపారు. బిపి, షుగర్ ప్రస్తుతానికి నార్మల్ గానే ఉన్నాయని వివరించారు. సాయంత్రం వరకు సీఎంను డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కేటీఆర్, కవిత హరీష్ రావు, సంతోష్, హిమాన్సు కూడా ఉన్నారు. కేసీఆర్ కు ఏమైందోనని టెన్షన్ పడుతున్న టీఆర్ఎస్ శ్రేణులకు డాక్టర్లు ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు.
Also Read: తర్వాత టార్గెట్ ఆ రెండు రాష్ట్రలే.. మోడీ వ్యూహం మొదలెట్టేశారు