https://oktelugu.com/

AP Budget 2022-23: ఏపీ ఆర్థిక బ‌డ్జెట్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే..?

AP Budget 2022-23:  ఏపీలో ఇప్పుడు బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. కాగా ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర బ‌డ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఈ సారి ఆయ‌న మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎందుకంటే ఆయ‌న తమిళ కవి తిరువళ్లువార్ మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో జ‌గ‌న్ ను పొగిడే కార్య‌క్ర‌మంలో భాగంగా ఆ లైన్ ను తీసుకున్నార‌ని త‌ర్వాత అర్థ‌మైంది. అయితే ఏపీ ఆర్థిక ప‌రిస్థితి […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 11, 2022 / 03:49 PM IST
    Follow us on

    AP Budget 2022-23:  ఏపీలో ఇప్పుడు బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. కాగా ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర బ‌డ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఈ సారి ఆయ‌న మాట‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎందుకంటే ఆయ‌న తమిళ కవి తిరువళ్లువార్ మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో జ‌గ‌న్ ను పొగిడే కార్య‌క్ర‌మంలో భాగంగా ఆ లైన్ ను తీసుకున్నార‌ని త‌ర్వాత అర్థ‌మైంది.

    AP Budget 2022-23

    అయితే ఏపీ ఆర్థిక ప‌రిస్థితి రోజు రోజుకూ దారుణంగా ప‌డిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లో కూడా సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ద పీట వేశారు జ‌గ‌న్‌. ఈ విష‌యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నాలుగో సారి బడ్జెట్ ను తీసుకొస్తున్నామ‌ని, ఇది కూడా సంక్షేమ బ‌డ్జెట్ అని వివ‌రించారు. అయితే ఈ సారి రూ. 256256 కోట్ల బడ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు.

    Also Read:  కేసీఆర్ చేయినొప్పికి అదే కార‌ణం.. సీఎం ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన డాక్ట‌ర్లు..

    ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 208261 కోట్లుగా ఉంది. మూలధన వ్యయం మాత్రం రూ.47,996 కోట్లుగా ఉంటే.. రెవెన్యూ లోటు – రూ. 17,036 కోట్లు ఉంద‌ని తెలిపారు. ఇక ద్రవ్యలోటుకు వ‌చ్చే స‌రికి రూ.48,724 కోట్లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇందులో ఎక్కువ‌గా వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌గా రూ.18వేల కోట్ల‌ను కేటాయించారు.

    ఇక రైతుల కోసం ఇచ్చే వైఎస్ఆర్ రైతు భరోసా కింద రూ.3900 కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం రూ.2063 కోట్లు కేటాయించారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కోసం కూడా భారీగా రూ.15,846 కోట్లు కేటాయించారు. ఇక రెవెన్యూశాఖ కోసం రూ.5306 కోట్లు, గృహ నిర్మాణం కింద రూ.4791 కోట్లు, అటవీ శాఖకు రూ.685 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2014 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్ కింద‌ రూ.22,706 కోట్లు కేటాయించారు.

    AP Budget 2022-23

    ఈడబ్ల్యూఎస్ ప‌నుల కోసం రూ.10201 కోట్లు, వృత్తి నైపుణ్యం కోసం రూ.969 కోట్లు, సాంఘిక సంక్షేమం కోసం రూ.12728 కోట్లు, రోడ్లు భవనాల కింద రూ.8,581 కోట్లు, మహిళా శిషు సంక్షేమం కింద రూ.4,382 కోట్లు అలాగే ప్ర‌జ‌ల వైద్య ఆరోగ్యం అవ‌స‌రాల నిమ‌త్తం రూ.15,384 కోట్లు కేటాయించారు. ఇక వార్డు వాలంటీర్లకు రూ.3396 కోట్లు, * నీటి పారుదల వరదల నివారణ కింద రూ.11482.37 కోట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ రూ.11.78 కోట్లు, రవాణా రంగం కింద రూ.9,617.15 కోట్లను ఏపీ ప్ర‌భుత్వం కేటాయించింది. అయితే ఇందులో ఉపాధి రంగాన్ని డెవ‌ల‌ప్ చేసే బ‌డ్జెట్ కంటే కూడా సంక్షేమ ప‌థ‌కాల కోసం ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తున్నారు. మొన్న కేంద్రం కూడా మితిమీరిన సంక్షేమ బ‌డ్జెట్ వ‌ల్ల‌నే ఏపీ అప్పుల్లో కూరుకుపోతోంద‌ని తేల్చి చెప్పిన త‌ర్వాత కూడా.. జ‌గ‌న్ అదే దారిలో వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

    Also Read:  జనసేనలోకి జన వరద.. ఆవిర్భావ సభ ముందు ఊపు..

     

    Tags