
విశాఖ వేదికగా ఇప్పుడు రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. చలికాలం పూర్తికాకముందే ఎండల భగభగమండిపోతుండడంతో.. రాజకీయాలు కూడా అదే స్థాయిలో సలసల అంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఒక్కొక్కరుగా ఉద్యమం బాట పడుతున్నారు.
Also Read: తెలంగాణ పుట్టినిల్లు.. మెట్టునిల్లు : ఇదే షర్మిల స్లోగన్
టీడీపీ సైతం దీని మీద అధికార పార్టీని కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దు అన్నది టీడీపీ ఆలోచన అయితే దాన్ని పక్కన పెట్టేశారు గంటా. ఇక ఇపుడు ఆయన చేస్తున్న విమర్శలు హాట్ కామెంట్స్ టీడీపీకి బాగానే తగులుకుటున్నాయి.
ఉక్కు కర్మాగారాన్ని కాపాడే అసలైన త్యాగపురుషులం తామే అని గంటా చేసిన కామెంట్స్ టీడీపీకి బాగానే ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపంలో టీడీపీకి వాటా ఉందంటూ గంటా చేస్తున్న వ్యాఖ్యలు పసుపు శిబిరాన్ని కలవరపెట్టేవే. మరి నేల విడిచి సాము చేస్తున్నట్లుగా కేంద్రాన్ని వదిలి పెట్టి వైసీపీ మీద బాణాలు వేస్తున్న టీడీపీ తనకూ ఈ పాపం అంటగడితే తట్టుకుంటుందా, అందునా సొంత పార్టీ ఎమ్మెల్యేవే ఇలా అంటే అసలు భరించగలదా.
Also Read: వర్షాలపై నా మాటలు వక్రీకరించారు: మేయర్ విజయలక్ష్మి
మరి ఈ నేపథ్యంలో టీడీపీ ఎలాంటి వైఖరి చూపబోతోందనని ఆసక్తికరంగా ఉంది. గంటా రాజీనామా.. గంటా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్