https://oktelugu.com/

మెగాస్టార్ కు ఏమైంది.. ఇలా ఆలోచిస్తున్నాడు?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ‘ఖైదీ-150’ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఇండస్ట్రీ హిట్టు అందుకున్నాడు. తొమ్మిదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ ‘ఖైదీ-150’తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా తగ్గలేదని నిరూపించాడు. Also Read: నిహారిక పెళ్లి పనులు షూరు.. ఆ మెగా హీరోదే పెత్తనం? మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కొత్తతరహాలో మెగా ఎంట్రీని ఆశించారు. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 01:17 PM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ‘ఖైదీ-150’ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఇండస్ట్రీ హిట్టు అందుకున్నాడు. తొమ్మిదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ ‘ఖైదీ-150’తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా తగ్గలేదని నిరూపించాడు.

    Also Read: నిహారిక పెళ్లి పనులు షూరు.. ఆ మెగా హీరోదే పెత్తనం?

    మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కొత్తతరహాలో మెగా ఎంట్రీని ఆశించారు. అయితే మెగాస్టార్ మాత్రం తమిళ రీమేక్ ‘కత్తి’ని తెలుగులో రీమేక్ చేసి వారి ఆశలపై నీళ్లుచల్లారు. చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ మూవీ థియేటర్లలో రావడంతో ప్రేక్షకులు ఆదరించారు. అయితే వారిలో మాత్రం నిరుత్సాహం అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.

    ‘ఖైదీ-150’ తర్వాత చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’లో నటించాడు. ఈ మూవీలో ‘సైరా నర్సింహారెడ్డి’ పాత్రకు చిరంజీవి జీవం పోశాడు. ఈ మూవీ మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదే తరహాలో మెగాస్టార్ తదుపరి మూవీలు చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగాస్టార్ మాత్రం ఇందుకు భిన్నంగా వరుస రీమేక్ మూవీలపై మనస్సు పారేసుకుంటున్నాడు.

    ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. కొరటాల శివ-మెగాస్టార్ కాంబోలో వస్తున్న తొలి మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కరోనాతో ఈ మూవీ షూటింగు నిలిచిపోయింది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ వరుసగా రీమేక్ మూవీ చేయనుండటంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

    ఇప్పటికే మెగాస్టార్ ఒకే చేసిన ప్రాజెక్టుల్లో మలయాళంలో సూపర్ హిట్టు సాధించిన ‘లూసీఫర్’.. తమిళంలో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన ‘వేదాళం’ మూవీలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకు కూడా అవుట్ డేటేట్ దర్శకులు తెరక్కెక్కిస్తున్నారు. వేదాళం మూవీని మోహర్ రమేష్.. లూసీఫర్ మూవీని వీవీ.వినాయక్ తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు.

    Also Read: ‘ఖిలాడీ’ ఫస్టు లుక్కుపై రవితేజ ఏమన్నాడంటే?

    ఇక తాజాగా మెగాస్టార్ తమిళ హిట్ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఎన్నై అరిందాల్’ మూవీ తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో డబ్ అయి ఓ మోస్తరుగా ఆడింది. చిరు వరుసగా రీమేక్ మూవీలకు కమిట్ అవుతుండటంతో మెగాస్టార్ మూవీల్లో కొత్తదనం లేకుండా పోతుందని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

    మెగాస్టార్ అంటే ట్రెండ్ సృష్టించేలా సినిమాలు చేయాలిగానీ.. అల్రెడీ హిట్టయిన సినిమాలు చేయడం ఏంటని మెగా ఫ్యాన్సే పెదవి విరుస్తున్నారు. మెగాస్టార్ కు ఏమైదంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా మెగాస్టార్ అభిమానులను ఖుషీ చేసేలా సినిమాలు చేస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!