ఎంపీ రఘురామ విడుదల మరింత ఆలస్యం

దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్న చందంగా మారింది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పరిస్థితి. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ ఏపీ ప్రభుత్వంతో పోరాడి.. దెబ్బలు తిని బెయిల్ తెచ్చుకున్నా కూడా ఆయన విడుదల కాకపోవడం గమనార్హం. ఆయన విడుదల మరింత జాప్యం కానుంది. ఎంపీ రఘురామ బెయిల్ పిటీషన్ లో ఏపీలోని సీఐడీ కోర్టు పలు పత్రాలు అడగడంతో ఆయన విడుదలకు బ్రేక్ పడింది. మరో నాలుగు రోజుల వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి […]

Written By: NARESH, Updated On : May 24, 2021 5:46 pm
Follow us on

దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్న చందంగా మారింది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పరిస్థితి. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ ఏపీ ప్రభుత్వంతో పోరాడి.. దెబ్బలు తిని బెయిల్ తెచ్చుకున్నా కూడా ఆయన విడుదల కాకపోవడం గమనార్హం. ఆయన విడుదల మరింత జాప్యం కానుంది.

ఎంపీ రఘురామ బెయిల్ పిటీషన్ లో ఏపీలోని సీఐడీ కోర్టు పలు పత్రాలు అడగడంతో ఆయన విడుదలకు బ్రేక్ పడింది. మరో నాలుగు రోజుల వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.

ఎంపీ రఘురామకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇద్దరు వ్యక్తులు లక్ష పూచీకత్తును స్థానిక కోర్టులో ఇచ్చి తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పూచీకత్తు పిటీషన్ ను ఎంపీ రఘురామ న్యాయవాదులు ట్రయల్ కోర్టులో వేశారు.

అయితే ట్రయల్ కోర్టు జడ్జి ఎంపీ రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ సమ్మరీ కావాలని కోరారు. ప్రస్తుతం ఎంపీ రఘురామ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన డిశ్చార్జ్ కావడానికి మరో నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు.

దీంతో నాలుగురోజుల తర్వాత మరోసారి పూచీకత్త పిటీషన్ ను సీఐడీ కోర్టులో వేయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ జడ్జి ఈయన బెయిల్ పిటీషన్ ఆమోదించే అవకాశాలు లేవు. దీంతో రఘురామ విడుదల మరింత ఆలస్యం కానుంది.