https://oktelugu.com/

ఆ హీరో పక్కన నటించాలనుంది: సమంత

అక్కినేని సమంత కాస్త బోల్డ్ గానే ఉంటుంది. మనసులో ఏమున్నా మొహమాటం లేకుండా చెప్పేస్తోంది. తాజాగా సమంత ఓ బాలీవుడ్ హీరో మీద ఉన్న ఇష్టాన్ని చాల ఇష్టంగా చెప్పేసింది. ప్రస్తుతం సామ్ ‘ది ఫ్యామిలీ మెన్ 2′ వెబ్ సిరీస్‌ తో బాలీవుడ్‌ లోకి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. రాజీ అనే పాత్రలో సమంత నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ బాగానే ఆకట్టుకుంది. […]

Written By:
  • admin
  • , Updated On : May 24, 2021 / 04:51 PM IST
    Follow us on

    అక్కినేని సమంత కాస్త బోల్డ్ గానే ఉంటుంది. మనసులో ఏమున్నా మొహమాటం లేకుండా చెప్పేస్తోంది. తాజాగా సమంత ఓ బాలీవుడ్ హీరో మీద ఉన్న ఇష్టాన్ని చాల ఇష్టంగా చెప్పేసింది. ప్రస్తుతం సామ్ ‘ది ఫ్యామిలీ మెన్ 2′ వెబ్ సిరీస్‌ తో బాలీవుడ్‌ లోకి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. రాజీ అనే పాత్రలో సమంత నటించింది.

    ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ బాగానే ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. తాజాగా ఫ్యామిలీమెన్‌ టీంతో కలిసి ప్రమోషన్లలో పాల్గొన్న సమంత పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. బాలీవుడ్‌ లో మీకు ఏ హీరో సరసన నటించాలని ఉంది ? అని యాంకర్ ప్రశ్నించగా..

    వెంటనే హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తో నటించాలనుంది అంటూ చిన్న చిరు నవ్వుతో నవ్వులు చిందిస్తూ తన మనసులో మాటను చెప్పింది. గతంలో కూడా రణ్‌బీర్‌ కపూర్‌ అంటే, తనకు ఎంతో ఇష్టం అని పలు సందర్భాల్లో చెప్పింది. మరి సామ్ రణ్ బీర్ కాంబినేషన్‌లో సినిమా వస్తోందా ? ఏ డైరెక్టర్ అయినా వీరి కలయికలో సినిమా ప్లాన్ చేస్తే.. సమంత కథ కూడా వినకుండా యాక్ట్ చేస్తోందట.

    ఇక ఈ వెబ్‌ సిరీస్‌ లో మనోజ్‌ బాజ్‌ పాయ్‌ చేసిన పాత్ర, తెలుగు హీరోలలో ఎవరికి సూట్‌ అవుతుందని అడిగితే, మా మామ నాగార్జున అంటూ సరదాగా చెప్పింది. తెలుగు దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ పై నేషనల్ వైడ్ గా మంచి బజ్ ఉంది. ఇక జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ హిట్ అయితే మాత్రం వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగడం ఖాయం.