Currency Notes : ఎన్నికల ముంగిట కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో ఎన్నో రకాల సంచలనాలు ఉన్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర తగ్గింపుతో కేంద్రం బలమైన సంకేతాలను పంపించింది. ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి కీలక బిల్లులను తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. జెమిని ఎన్నికలు, మహిళా బిల్లు వంటి వాటితో పాటు దేశం పేరు ఇక భారత్ గా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. అదే జరిగితే ఇండియా పేరుతో నిర్వహిస్తున్న అన్ని పేర్లు భారత్ గా మారనున్నాయి. ఈ తరుణంలో పెద్ద నోట్లు రద్దు అంశం సాంకేతికంగా తెరపైకి వచ్చింది.
దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకుగాను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని.. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మహిళా బిల్లుతో పాటు కీలక నిర్ణయాలన్నింటికీ ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది.
ఒకవేళ ఇండియా పేరును భారత్ గా మారిస్తే.. ఇప్పటివరకు ఇండియా పేరి ట జరిగే కార్యకలాపాలన్నీ.. భారత్ గా మార్చాల్సిన అవసరం ఉంది. ఇండియా పేరిట నిర్వహిస్తున్న సంస్థలు, బ్యాంకుల పేర్ల మార్పు అనివార్యం. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ గా మారనుంది. అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తనుంది. ఆర్.బి.ఐ జారీ చేసిన అన్ని కరెన్సీ నోట్ల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు ఉంటుంది. దేశం పేరు మారితే ఈ కరెన్సీ నోట్లను ఏం చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కరెన్సీ నోట్లకు మినహాయింపు ఇస్తారా.. లేకుంటే రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.