ఇంతటి కరోనా కల్లోలంలో దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి దూరమైంది. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమై చాలా మంది అష్టకష్టాలు పడ్డారు. ఇప్పటికీ ఉద్యోగాల పునరుద్ధరణ జరగలేదు. కానీ మన కుబేరుల సంపద కరిగిపోవడం అటుంచి పెరగడం విశేషం.
Also Read: రజినీకాంత్ సంచలనం: పార్టీ పేరు, గుర్తు ఖరారు.. ఇవే?
అందరికీ ఆర్థిక పరీక్ష పెట్టిన కరోనా కాలంలో భారతదేశంలోని కుబేరులు మాత్రం సంపద పోగేసుకొని సత్తా చాటారు. తమ ఆస్తుల్ని భారీగా పెంచుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
ఈ ఏడాదిలో భారత్ కు చెందిన ఏడుగురు కుబేరుల సంపాదన 60 బిలియన్ డాలర్లకు చేరడంతో వీరి మొత్తం సంపద దాదాపుగా 200 బిలియన్ డాలర్లు దాటేసింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లినా దేశీయ కుబేరుల సంపద మాత్రం యాభై శాతం పెరిగినట్లుగా పేర్కొంది.
వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. గౌతమ్ ఆదానీ.. అజీమ్ ప్రేమ్ జీ.. శివనాడార్.. డీ మార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ తదితరులు ఉన్నారు. తొలితరం పారిశ్రామవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. ముకేశ్ అంబానీ సంపద అయితే 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Also Read: రైతుల ఆందోళన: యాంటీ మోడీ.. జియోకు భారీ దెబ్బ?
ఐటీ దిగ్గజాలు హెచ్ సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్.. విప్రో అధినేత ప్రేమ్ జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లుగా వెల్లడించింది.హెల్త్ కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సింఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 9.69 బిలియన్ డాలర్లకు పెరిగింది. వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్ ఇన్ స్టిట్యూట్ వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది. ఈ ఏడాది అతడి ఆస్తికి 6.91 బిలియన్ డాలర్లు జత కావటంతో అతని వ్యక్తిగత సంపద 15.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక.. లాక్ డౌన్ వేళలో భారీగా వ్యాపారం చేసిన డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద 4.71 బిలియన్ డాలర్లతో మొత్తం 14.4 బిలియన్ డాలర్లైంది. ఇంతటి కరువు కాలంలోనూ మన కుబేరులు సంపద పోగేసుకోవడం విశేషంగా చెప్పవచ్చు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్