https://oktelugu.com/

రేవంత్ రెడ్డి మౌనం వ్యూహాత్మమేనా?

తెలంగాణలో పీసీసీ నియామకం కాంగ్రెస్ అధిష్టానానికి సవాలుగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పీసీసీ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీలోని ముఖ్య నేతలందరి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి త్వరలోనే ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. టీపీసీసీ కోసం కాంగ్రెస్ లోని సీనియర్ నేతలంతా పోటీపడుతున్నారు. ఎవరికీ వారు పీసీసీ పదవీ తమకే వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ పదవీని ఎవరికీ కట్టబెట్టాలనే దానిపై అధిష్టానం ముందుగానే ఓ నిర్ణయానికి […]

Written By: Neelambaram, Updated On : December 15, 2020 1:16 pm
Follow us on

తెలంగాణలో పీసీసీ నియామకం కాంగ్రెస్ అధిష్టానానికి సవాలుగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పీసీసీ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీలోని ముఖ్య నేతలందరి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి త్వరలోనే ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది.

టీపీసీసీ కోసం కాంగ్రెస్ లోని సీనియర్ నేతలంతా పోటీపడుతున్నారు. ఎవరికీ వారు పీసీసీ పదవీ తమకే వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ పదవీని ఎవరికీ కట్టబెట్టాలనే దానిపై అధిష్టానం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: బీజేపీ జోష్.. టీఆర్ఎస్ సైలెన్స్..!

తెలంగాణలో కాంగ్రెస్ ను ఎవరైతే గాడిన పెడుతారో వారికే పదవీ కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. దీంతోనే అధిష్టానం అభిప్రాయ సేకరణ పేరుతో టీపీసీసీపై ఆశలు పెట్టుకున్న నేతలతో సంప్రదింపులు చేస్తూనే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.

టీపీసీసీ రేసులో ముందుగానే రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉంది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కొద్దిరోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీని దక్కించుకున్నాడు. సీఎం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు.

Also Read: రేవంత్ యాక్షన్ ప్లాన్ ముందుగానే రెడీ అయిందా?

దీంతో టీపీసీసీ మార్పు జరుగుతుందన్న ప్రతీసారి రేవంత్ రెడ్డి పేరు విన్పించింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం టీపీసీసీ పై సర్వే చేయగా రేవంత్ కే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీపీసీసీ పదవీపై ఇప్పటికే రేవంత్ కు స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కారణంగానే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోని సీనియర్లు మీడియా ఎదుట తమ మనస్సులోని బయట పెడుతుండగా రేవంత్ మాత్రం టీపీసీసీపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలు టీపీసీసీని రేవంత్ రెడ్డికి ఇచ్చారనే ప్రచారం జరగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

అభిప్రాయ సేకరణ కేవలం నేతలను బుజ్జగించేందుకే కావడంతో రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని తెలుస్తోంది. ఈక్రమంలోనే మరో రెండు మూడ్రోజుల్లో రేవంత్ పేరునే అధిష్టానం ప్రకటించనుందని టాక్ కాంగ్రెస్ శ్రేణుల్లో విన్పిస్తోంది.