https://oktelugu.com/

నోటిఫికేషన్ల వస్తాయని చెప్పినా.. తెలంగాణ యువత నమ్మట్లేదా?

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రతీ రాజకీయ పార్టీ తాయిళాలు ప్రకటించడం కామన్ అయిపోయింది. హామీలివ్వడమే గానీ వాటిని చిత్తశుద్ధితో నిలబెట్టుకున్న దాఖలాలు ఏ పార్టీలోనూ కన్పించదు. ఈక్రమంలోనే రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను మెజార్టీ ప్రజలు ఎన్నికల జిమ్మిక్కులుగానే కొట్టిపారేస్తున్నారు. Also Read: రేవంత్ రెడ్డి మౌనం వ్యూహాత్మమేనా? తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2020 / 11:59 AM IST
    Follow us on

    ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రతీ రాజకీయ పార్టీ తాయిళాలు ప్రకటించడం కామన్ అయిపోయింది. హామీలివ్వడమే గానీ వాటిని చిత్తశుద్ధితో నిలబెట్టుకున్న దాఖలాలు ఏ పార్టీలోనూ కన్పించదు. ఈక్రమంలోనే రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను మెజార్టీ ప్రజలు ఎన్నికల జిమ్మిక్కులుగానే కొట్టిపారేస్తున్నారు.

    Also Read: రేవంత్ రెడ్డి మౌనం వ్యూహాత్మమేనా?

    తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యాయి. త్వరలోనే ఖమ్మం.. వరంగల్ కార్పొరేషన్.. ఎమ్మెల్సీ పట్టభధ్రుల ఎమ్మెల్సీ.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి.

    ఈక్రమంలోనే టీఆర్ఎస్ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్న నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనే 50వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఉద్యోగాల ప్రకటనలకు సంబంధించిన పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయి.

    ఎన్నికలు వస్తుండటంతోనే సీఎం కేసీఆర్ నోటిఫికేషన్లు అంటూ హడావుడి చేస్తున్నారని తెలంగాణ యువత భావిస్తోంది. గతంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎన్ని పోరాటాలు.. నిరాహార దీక్షలు చేసిన స్పందని కేసీఆర్ ఉన్నఫలం నోటిఫికేషన్లు అనడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలపై యువత ఆశలు పెట్టుకోవద్దని చెప్పిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

    Also Read: ఓరుగల్లులో ‘బండి’ దూసుకెళ్లనుందా?

    గడిచిన ఆరేళ్లలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరుద్యోగులు ఇప్పటికే మరిచిపోవడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిన ఏదో ఒక తిరకాసు పెట్టి కోర్టు కేసులతో కాలం వెళ్లదీయడమో లేదా రద్దు చేయడమో చేస్తుందని నిరుద్యోగులు భావిస్తున్నారు.

    దీంతోనే కేసీఆర్ స్వయంగా 50వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతున్న తెలంగాణ యువత నమ్మడం లేదని తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా కేసీఆర్ రెండేళ్లు అయినా ఒక్కరికి కూడా ఇవ్వకపోవడాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికలు టీఆర్ఎస్ కు సవాలుగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్