https://oktelugu.com/

Telangana Elections 2023 : కానిస్టేబుల్ నే పిచ్చకొట్టుడు కొట్టిన సీఐ.. వైరల్

ఇక్కడ నీకేం పని అని ప్రశ్నిస్తూ సీఐ కానిస్టేబుల్ యాదగిరి ని లాఠీతో కొట్టారు. దూరంగా నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ నుంచి యాదగిరి పరుగు అందించుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2023 / 09:38 PM IST
    Follow us on

    Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. రకరకాల పరిణామాలు కనిపించాయి. తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. ఓ కానిస్టేబుల్ పై సిఐ లాఠీచార్జి చేయడం సంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    మహేశ్వర బిజెపి అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ నాదర్ గుల్ లోని జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరి ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా వచ్చారు. పోలింగ్ కేంద్రం బయట వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో పెట్రోలింగ్ వాహనంలో ఆదిభట్ల ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి అక్కడకు వచ్చారు. సీఐను చూసి కానిస్టేబుల్ సెల్యూట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇక్కడ నీకేం పని అని ప్రశ్నిస్తూ సీఐ కానిస్టేబుల్ యాదగిరి ని లాఠీతో కొట్టారు. దూరంగా నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ నుంచి యాదగిరి పరుగు అందించుకున్నారు.

    అయితే అక్కడకు కొన్ని గంటలకు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడే ఉండేవారు ఈ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది విపరీతంగా ట్రోలైంది. భద్రతా చర్యల్లో భాగంగానే సీఐ ఈ చర్యకు దిగి ఉంటారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీస్ శాఖకు ఎటువంటి ఫిర్యాదులు లేకపోవడం విశేషం.