Allu Arjun Arrested: వాస్తవానికి జాతీయ మీడియా దక్షిణాది రాష్ట్రాలలో జరిగే సంఘటనలను పెద్దగా ప్రసారం చేయదు. వాటికి అంతగా ప్రాధాన్యం కూడా ఇవ్వదు. కానీ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం నుంచి జాతీయ మీడియా తెగ ఫోకస్ చేసింది. కథనాల మీద కథనాలు ప్రసారం చేసింది. అయితే రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామి ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా డిబేట్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే అర్ణబ్ గోస్వామి అంత ఎత్తున ఎగిరిపడతాడు. రెండో వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాగుతూనే ఉంటాడు. శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ అరెస్టుపై తన చానల్లో నిర్వహించిన డిబేట్లోనూ అదే విధంగా అర్ణబ్ గోస్వామి వ్యవహరించాడు. ” నన్ను నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే అరెస్ట్ చేయించి లోపలేసాడు. శుక్రవారం అల్లు అర్జున్ ను అరెస్టు చేసి.. శని, ఆదివారాలు జైల్లో ఉంచాలని అనుకున్నాడు. అలా ఉంచి తను సూపర్ స్టార్ కావాలి అనుకున్నాడు. కానీ యాదృచ్ఛికంగా అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చింది. ఫలితంగా అల్లు అర్జున్ స్టార్ అయిపోగా.. రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అయ్యాడని” అర్ణబ్ గోస్వామి విమర్శించారు. ఈ వీడియోను భారత రాష్ట్రపతి అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ తెగ సర్కులేట్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని జాతీయ మీడియా సైతం విమర్శిస్తుందని. తెలంగాణ పరువును రేవంత్ రెడ్డి మంట కలిపారని భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు తిట్టడం మొదలుపెట్టారు.
అర్ణబ్ గోస్వామి ఎందుకిలా..
ఇటీవల ముఖ్యమంత్రిగా ఏడాది పాటు రేవంత్ రెడ్డి విజయవంతంగా తన పరిపాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ మీడియా ఛానల్స్ రకరకాల కార్యక్రమాలు చేపట్టాయి. సహజంగానే జాతీయ మీడియా ప్రత్యేక కార్యక్రమం చేపడితే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పైగా మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం ఈ విధానానికి సహకరిస్తుంటాయి కూడా. అయితే ఇటీవల రిపబ్లిక్ టీవీ రేవంత్ రెడ్డిని అప్రోచ్ కాగా.. ఆయన టీం రిజెక్ట్ చేసిందని సమాచారం. అందువల్లే అర్ణబ్ గోస్వామి రేవంత్ రెడ్డి పై ఆ స్థాయిలో విమర్శలు చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఒక ముఖ్యమంత్రి పై నేరుగా అలాంటి విమర్శలు చేయడానికి తప్పు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో బాధ్యతాయుత మీడియా అధినేతగా ఉన్న వ్యక్తి.. చవకబారు విమర్శలు చేసి పరువు పోగొట్టుకోకూడదని సూచిస్తున్నారు. “అర్ణబ్ గోస్వామి ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని తెలుసు.. అందువల్లే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి పై ఆ స్థాయిలో విమర్శలు చేశారు. నిజాలు ఏవో తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడారు. పాత్రికేయ జీవితంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా.. రాజకీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి విమర్శలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారు. పాత్రికేయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు ఇలాంటి దూషణలకు పాల్పడటం సరి కాదని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అయ్యాడు
అల్లు అర్జున్ సూపర్ సూపర్ స్టార్ అయ్యాడురేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ను వీకెండ్ అరెస్ట్ చేసి సోమవారం వరకు జైల్లో పెట్టాలి అనుకున్నాడు – అర్ణబ్ గోస్వామి
Video Credits – Republic TV pic.twitter.com/ctd7BbH497
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024