spot_img
Homeజాతీయ వార్తలుManipur Violence: పిల్లలు ఉన్నారన్నా వదిలిపెట్టలేదు.. మణిపూర్‌లో భయానక ఘటనలు.. ఒక్కొక్కటిగా వెలుగులోకి..

Manipur Violence: పిల్లలు ఉన్నారన్నా వదిలిపెట్టలేదు.. మణిపూర్‌లో భయానక ఘటనలు.. ఒక్కొక్కటిగా వెలుగులోకి..

Manipur Violence: రెండు నెలలుగా, మణిపూర్‌ హింసాకాండతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది. గత బుధవారం, ఒక వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది, ఇది మొత్తం దేశాన్ని కదిలించింది. యావత్‌ జాతి సిగ్గుపడేలా చేసింది. ముగ్గురు మహిళలను నగ్నంగా ఉరేగించే ఫుటేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు రోజులకు మరో ఘటన వెలుగుచూసింది. ఇందులో ఓ వ్యక్తి తలను నరికి చెట్టుకు వెలాడదీశారు. అయితే ఇంత హింస జరుగుతున్నా పోలీసులు, సైన్యం అదుపు చేయలేకపోవడమే ఇప్పుడు సందేహాలకు తావిస్తోంది. నగ్నంగా ఉరేగించిన మహిళల్లో ఒక మహిళ మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

పిల్లలు ఉన్నారని చెప్పినా..
మే 4వ తేదీన తమపైదాడి జరిగిందని బాధిత మహిళ తెలిపింది. తమపై దాడి జరుగుతుందని తెలిసి పిల్లలను ఊరికి పంపిచామని చెప్పింది. భర్తతో కలిసి వెళ్తుంటే మైతేయి తెగ మూకలు తమను అడ్డగించి తీవ్రంగా కొట్టారని పేర్కొంది. దుస్తులు లాగేశారని వెల్లడించింది. తనకు పిల్లలు ఉన్నారని, చేతులెత్తి మొక్కుతున్నా వదిలేయండని వేడుకున్నా కనికరించలేదని కన్నీరు పెట్టుకుంది. వివస్త్రను చేసి ఊరేగించారని తెలిపింది. పోలీసుల ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

భద్రతా దళాలకు చెప్పినా..
గ్రామ పంచాయతీ సభ్యులతో సహా కొంతమంది వ్యక్తులు చురచంద్‌పూర్‌లో గందరగోళం గురించి తమకు తెలియజేశారు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఒకట్రెండు ఇళ్లు తగలబడిపోయాయని సమాచారం అందింది. భయంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రతా దళాల కంపెనీకి సమాచారం అందించినా రక్షించడానికి రాలేదని బాధితురాలు తెలిపింది. తండ్రి, కొడుకుతోపాటు ఒక మహిళను దారుణంగా చంపారు. ముగ్గురు మహిళలను కూడా బట్టలు విప్పి లైంగికంగా వేధించారు. పోలీసులకు ఫోన్‌ చేసినా రాలేదని వెల్లడించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper