ఆ మీడియాకు చేతనయ్యింది ఒక్కటే.. వ్యక్తిత్వ హననం.. అది జగన్ అయినా.. భాజాపా నాయకులు అయినా ఒక్కటే. బురద వేయడం.. మేమే వేశాం.. మీరు కడుక్కోండి అనడం.. ట..ట…ట అంటూ.. బోగట్టా స్కీమును ఆధారం చేసుకుని, తాము మేయిన్ స్ట్రీమ్ మీడియా అనే మాటే మరిచిపోయి, కథనాలు వండి వార్చేయడం.. జనాల మీదకు కథనాల అనుమానాలు వదలిలేయడం ఆ సంస్థకు ఇప్పుడు బాగా అలవాటు అయ్యింది.
Also Read: గీ.. గిల్లుడేంది ‘గంగుల’
జగన్ టైమ్ లో లక్ష కోట్ల అవినీతి అనే టముకు వేశారు. పోస్టర్లు వేశారు. వాటిని ఫుల్ పేజీలో ప్రకటించేశారు. ఇప్పటికే అదే బాజాను వాయిస్తూ.. వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు భాజాపా జనాలు మంచి మిత్రులు అయ్యారు. అందువల్ల వాళ్ల మీద బురద వేయాలని చూడలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రా భాజాపా ఈ మీడియాను పక్కన పెట్టేసింది. అంతే మళ్లీ బురద వెతికి తెచ్చారు.
రెండేళ్ల క్రితం జరిగిన సంఘటన అంటూ.. ఓ చీకటి డీల్ ను బయటకు తెస్తున్నామంటూ.. చెబుతూ.. 30కోట్లు వసూలు చేశారని భాజాపా పెద్ద తలకాయలు రెండింటి మీద బురదవేశారు. మరి ఈ రెండేళ్లు ఈ బురదను ఎందుకు దాచినట్లో..? అంటే ఇలాంటి బురద బురద అంతా దగ్గర పెట్టకుంటారు. అవసరమైతేనే ఎలా వాడాలనుకుంటే.. అలా వాడతారన్న మాట.
Also Read: బీజేపీతో దోస్తీ కటీఫ్ కు పవన్ యోచనా?
నికార్సయిన మీడియా అయితే అప్పుడే బయటపెడితే.. సబబుగా ఉండేది. కానీ ఇప్పుడు బయటపెట్టడం అంటే మిత్ర భేదమే కారణం అని జనాలకు అర్థం అవుతోంది. ఇక భాజాపా నేతలు ఇలాంటి వాటికి సిద్ధం అయిపోవాలి. లేదా కాళ్ల బేరానికి వచ్చి.. ఆ మీడియా బాస్ నే ఎత్తి వేయాలి.. కానీ ఏం జరుగుతుందో..చూడాలి ఇక…
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్