https://oktelugu.com/

గీ.. గిల్లుడేంది ‘గంగుల’

మైకు దొరికితే చాలు.. తమకన్నా తోపు ఎవరూ లేరన్నవిధంగా తెలంగాణలోని కొంతమంది టీఆర్ఎస్ లీడర్లు రెచ్చిపోతుంటారు. ఆకాశాన్ని కిందికి దింపినట్లు.. భూమికి నిచ్చెనలు వేసినట్లు గొప్పలు చెప్పుకుంటారు. తమ అధినేత దేవుడని.. తామందరం పూజారులమని భజన చేస్తుంటారు. తమకు పోటీనే లేదని.. వన్ మెన్ షో అన్నట్లు గొప్పలు చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో వీరు మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతు న్నాయి. ఏం మాట్లాడుతున్నారో.. వారికి అర్థం కాకపోయినా.. ప్రజలు ఆ మాటలు విని […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 1, 2021 / 11:20 AM IST
    Follow us on


    మైకు దొరికితే చాలు.. తమకన్నా తోపు ఎవరూ లేరన్నవిధంగా తెలంగాణలోని కొంతమంది టీఆర్ఎస్ లీడర్లు రెచ్చిపోతుంటారు. ఆకాశాన్ని కిందికి దింపినట్లు.. భూమికి నిచ్చెనలు వేసినట్లు గొప్పలు చెప్పుకుంటారు. తమ అధినేత దేవుడని.. తామందరం పూజారులమని భజన చేస్తుంటారు. తమకు పోటీనే లేదని.. వన్ మెన్ షో అన్నట్లు గొప్పలు చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో వీరు మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతు న్నాయి. ఏం మాట్లాడుతున్నారో.. వారికి అర్థం కాకపోయినా.. ప్రజలు ఆ మాటలు విని ముక్కున వేలేసుకుంటున్నారు.

    Also Read: షర్మిలకు భయపడుతున్న పవన్.. కారణం ఇదేనా..?

    ఉమ్మడి ఏపీ రెండగా మారింది. విభజన కష్టాలతో ఇప్పటికీ రగులుతూనే ఉంది. మరో వైపు అద్భుత ఆర్థిక వనరులతో హైదరాబాద్ ప్రగతిపథంలో ముందుకు సాగుతోంది. సరే.. విడిపోయినా.. ఎవరిబాధలు వారివి.. కానీ.. తెలుగు ప్రజలందరూ ఒక్కటేగా.. అంతా సోదరులేగా.. నిన్నటిదాక కలిసిమెలిసి ఉన్నారుగా.. ఆ సోయి మరిచిపోయిన టీఆర్ఎస్ మంత్రి గుంగుల కమలాకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సాటి తెలుగువారు అయిన ఆంధ్రులకు మంట పుట్టించేలా ఉన్నాయి.

    ఏపీలో చిచ్చు పెట్టేలా గంగుల కమలాకర్ కామెంట్స్ ఉన్నాయని పలువురు అంటున్నారు. వైఎస్సార్ తనయ షర్మిల ఇంకా పార్టీ పెట్టనేలేదు. పెట్టినా కూడా తప్పులేదు. ఆమె పార్టీ రాజకీయ విధానాల మీద ఎవరైనా విమర్శలు కూడా చేయవచ్చు. కానీ.. అవన్నీ వదిలేసి.. ఇక్కడ పార్టీ పెట్టకూడదు. అవసరం అయితే రాయలసీమ రాష్ర్టం కోసం పోరాడు అంటూ.. షర్మిలకు గంగుల కమలాకర్ సలహాలు ఇవ్వడం బాధ్యతారాహిత్యమేనని అంటున్నారు. ఇప్పటికే విడిపోయిన రాష్ట్రాలు నిధులు లేక నీరసించిపోతున్నాయి. ప్రత్యేక హోదాలేక కూనారిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రాల పేరిట కొత్త వివాదాలు రేపాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని మేథావులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

    Also Read: ‘గులాబీ’ నేతల్లో కొత్తపార్టీ గుబులు

    ఎంతకాలం ఆంధ్రులకు బూచీగా చూపిస్తారు. ఆంధ్రులను దోచుకుంటారు.. జనాలను మభ్య పెడతారన్న మాట తెలంగాణ సమాజంన నుంచి వినిపిస్తోంది. దోడిపీ దారుడికి ప్రాంతం, వర్గం, వర్ణం ప్రత్యేకంగా ఉంటుందా..? ఆంధ్రా బూచీ చూపించి గెలవాలనుకోవడం దిగజారుడు రాజకీయమేనని కూడా అంటున్నారు. 2018 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెత్తనం చెలాయించాలని అనుకున్నాడు. అని ప్రచారం చేసిన ఎన్నికల్లో గెలిచిన వారు ఇప్పుడు షర్మిలను ఆంధ్రా పార్టీ అంటూ.. ఇంకా పుట్టని పార్టీమీద నిందలు వేయడం కూడా తగదని పలువురు అంటన్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్