https://oktelugu.com/

రేణిగుంట విమానాశ్రయంలో బైటాయించిన చంద్రబాబు.. నేలపై కూర్చొని నిరసన.. తీవ్ర ఉద్రిక్తత

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించిన పోలీసులు ఆయనను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ లు చేశారు.టీడీపీ నేతల ఇళ్ల ముందు నోటీసులు అందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రేణిగుంట విమానాశ్రయానికి రాగా వారిని వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కీలక […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2021 / 11:44 AM IST
    Follow us on

    టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించిన పోలీసులు ఆయనను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ లు చేశారు.టీడీపీ నేతల ఇళ్ల ముందు నోటీసులు అందించారు.

    టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రేణిగుంట విమానాశ్రయానికి రాగా వారిని వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. కీలక టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేసి పీఎస్ లకు తరలించారు.

    చంద్రబాబు ధర్నాకు అనుమతి ఇవ్వని పోలీసులు ఆయన రేణిగుంట విమానాశ్రయం వద్దకు రాగానే ఆంక్షలు విధించారు. దాదాపు 5వేల మందితో నిరసన చేపట్టాలని యోచించిన చంద్రబాబును ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. కరోనా విస్తరణ నేపథ్యంలో అనుమతి నిరాకరించారు.

    పోలీసులు అడ్డుకోవడంతో విమానాశ్రయంలోనే చంద్రబాబు బైటాయించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేలపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే బాబు కలవడానికి వచ్చిన రైల్వే కోడూర్ నేత నరసింహ ప్రసాద్ ను పోలీసులు తోసేశారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాను మీడియాతో మాట్లాడుతానన్న పోలీసులు చంద్రబాబును అనుమతించలేదు.

    నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సంఘం వద్ద అనుమతిపై తమకు తెలియదని పోలీసులు తెలిపారు. చంద్రబాబు పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని పోలీసులు నిరాకరించారు.

    దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు.