https://oktelugu.com/

Pawan Kalyan Janasena: జనసేన ఇక జనంలోకి..

Pawan Kalyan Janasena: జనసేన పార్టీ ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు పార్టీకి ముందుకు నడిపించే నేతలు లేక కొంత ఆలస్యమైనా తరువాత క్రమంలో మార్పులు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో పార్టీ శ్రేణులు పార్టీ కోసం ముందుకు వస్తున్నారు.ఇక ప్రభుత్వంపై పోరాడుతూనే పార్టీ విస్తరణకు పవన్ కల్యాణ్ నడుం కట్టారు. దీని కోసం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు గాను మార్చి 14న పార్టీ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి పార్టీ నేతలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2022 / 08:58 AM IST
    Follow us on

    Pawan Kalyan Janasena: జనసేన పార్టీ ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు పార్టీకి ముందుకు నడిపించే నేతలు లేక కొంత ఆలస్యమైనా తరువాత క్రమంలో మార్పులు వస్తున్నాయి. ప్రతి జిల్లాలో పార్టీ శ్రేణులు పార్టీ కోసం ముందుకు వస్తున్నారు.ఇక ప్రభుత్వంపై పోరాడుతూనే పార్టీ విస్తరణకు పవన్ కల్యాణ్ నడుం కట్టారు. దీని కోసం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు గాను మార్చి 14న పార్టీ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Pawan Kalyan

    దీనికి పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గీతం జనజన జనసేనా అంటూ సాగే పాటను ప్రత్యేకంగా మహిళలను ఉత్తేజపరిచే విధంగా తీర్చిదిద్దారు. దీంతో జనసేన ఇక జనంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. ప్రజాసమస్యలను లక్ష్యంగా చేసుకుని ముందుకు నడిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రజలు మార్పు కోరుకుంటున్న సందర్భంలో అధికారమే లక్ష్యంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read:  నాడు ఆ కామెడీ షోలో ‘సిద్దూ’నే ప్రశ్నించిన భగవంత్ మాన్.. ఇప్పుడు ఏకంగా సీఎం!.. వైరల్

    పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్న జనసేన సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. పవన్ కల్యాణ్ ఇక మీదట ప్రజల మధ్యనే ఉండాలని భావిస్తున్నారు. ప్రజల సమస్యలే ప్రధానంగా తీసుకుని వాటి పరిష్కారానికి పాటుపడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికిగాను ఇప్పటికే పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా వాటిని పరిష్కరించలేదు.

    Pawan Kalyan Janasena

    ఇకపై భవిష్యత్ లో కూడా మరిన్ని సమస్యలు తీసుకుని వాటిపై పోరాడేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలో పలు మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ కేడర్ విస్తరణ, నాయకులను తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. పవన్ కల్యాణ్ పక్కాగా వ్యూహ రచన చేస్తూ అందరికి దిశా నిర్దేశం చేస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Also Read: సీఎం కేసీఆర్ ఆస్పత్రి పాలవడంపై బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

    Tags